Saturday, 18 May 2024 10:28:09 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

చంద్రబాబు రోడ్ షోలో కరెంట్ తీసేసి రాళ్ల దాడి

Date : 23 April 2023 01:36 AM Views : 142

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు రోడ్ షో కొనసాగుతుండగా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ విషయం గమనించిన ఎన్ ఎస్ జీ కమోండోలు చంద్రబాబుకు రక్షణగా నిలవడంతో కమాండెంట్ సంతోష్ తలకు రాయి తగిలింది. ఆయనకు మూడు కుట్లు పడ్డాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సంఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు ఇరు వర్గాల మధ్య దాడులు జరగకుండా చర్యలు తీసుకున్నారు. తనపై రాళ్ళు విసరడంతో వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని.. తమ పార్టీ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. తన ముందు కుప్పిగంతులు వేయొద్దన్నారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. జగన్‌ లాంటి రాజకీయ నాయకుడిని దేశంలో ఎక్కడా చూడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :