Saturday, 18 May 2024 11:57:31 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ.. అడిగిన ప్రశ్నలు ఇవేనట

Date : 12 October 2023 08:50 AM Views : 78

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ విచారణ ముగిసింది. రెండో రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు లోకేష్. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. మొదటి రోజు నారా లోకేష్‌ను 30 ప్రశ్నలు అడిగిన సీఐడీ అధికారులు రెండో రోజు విచారణలో 47 ప్రశ్నలు అడిగారు. మొత్తం హెరిటేజ్ సంస్థకు సంబంధించి, లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు గురించి ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు చేయడం ద్వారా భారీగా లబ్ది పొందేలా కుట్ర పన్నినట్లు సీఐడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో 14 వ నిందితుడిగా ఉన్న లోకేష్‌ను హైకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ చేశారు అధికారులు. మొదటి రోజు హెరిటేజ్ భూముల కొనుగోలుపై లోకేష్‌ను ప్రశ్నలు అడిగారు. రెండో రోజు అన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకుని లోకేష్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో 2017లో అమరావతి అంశంలో ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కోసం ఈ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారా అనే వివరాలు అడిగారు. ఇక లోకేష్ మంత్రి అయిన వెంటనే కేబినెట్ సబ్ కమిటీలో ఎందుకు చేర్చారని కూడా అడిగారు. కేబినెట్ సబ్ కమిటీలో ఎవరెవరు ఉన్నారు.. అలైన్మెంట్ మార్పు కోసం మంత్రివర్గ ఉప సంఘంలో ఇతర సభ్యులను మీరు ఒత్తిడి చేశారా అని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. లింగమనేని రమేష్ మీకు ఎందుకు ఇల్లు ఉచితంగా ఇచ్చారని ప్రశ్నించిన సీఐడీ అధికారులు.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఖాతా నుంచి లింగమనేని రమేష్‌కు 27 లక్షలు ఎందుకు చెల్లించారని.. దానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేయలేదని ప్రశ్నించారు. లింగమనేని ఇల్లు క్విడ్ ప్రోకోలో ఇచ్చారు కదా.. అని అడిగినట్లు తెలిసింది. మొదటి రోజు ఆరున్నర గంటలపాటు నారా లోకేష్‌ను విచారించిన సీఐడీ అధికారులు రెండో రోజు ఆరు గంటలపాటు విచారించారు. ప్రస్తుతానికి విచారణ ముగిసినట్లు అధికారులు చెప్పారని… మళ్లీ ఎప్పుడు నోటీసులు ఇచ్చినా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లోకేష్ తెలిపారు. సీఐడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన తర్వాత నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడినుంచి ఢిల్లీ వెళ్లారు లోకేష్. సీఐడీ విచారణకు హాజరైన మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో చంద్రబాబు, నారాయణ, నారా లోకేష్ తో పాటు కొత్తపు పునీత్ పైనా కేసు నమోదు చేసింది సీఐడీ. మాజీ మంత్రి పొంగూరు నారాయణ అల్లుడు కొత్తపు పునీత్…ఈ కేసులో పునీత్ విచారణ కోసం సీఐడీ నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులపై పునీత్ హైకోర్టు కు వెళ్లడంతో న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. దీంతో తన లాయర్‌ను తీసుకుని పునీత్ ఉదయం 10 గంటలకు సీఐడీ ఆఫీస్ కు వచ్చారు. లోకేష్‌ను, పునీత్‌ను ఒకే కేసులో వేరువేరుగా విచారణ చేసింది సీఐడీ. IRR అలైన్మెంట్ మార్పులో భూముల ధరలు పెంచేలా చేయడం, నష్ట పరిహారం విషయంలో నారాయణతో పాటు పునీత్ కూడా ఆర్థిక లావాదేవీల్లో పాల్గొన్నారనేది సీఐడీ అభియోగం. దీంతో పునీత్ నుంచి సమాచారం సేకరించారు సీఐడీ అధికారులు. ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకూ పునీత్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు.రేపు కూడా విచారణకు హాజరుకావాలని పునీత్ కు సీఐడీ అధికారులు సమాచారం ఇచ్చారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :