Saturday, 18 May 2024 01:59:49 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

చంద్రగ్రహణం కార‌ణంగా రాత్రి 7గంటలకే శ్రీ‌వారి ఆల‌యం మూసివేత.. తిరిగి దర్శనం ఎప్పుడంటే..

Date : 29 October 2023 09:44 AM Views : 71

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : పాక్షిక చంద్రగ్రహణం కారణంగా నిత్యం భక్తులతో కిటికిటలాడే తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాత్రి 7.05 గంటలకే మూసి వేయాల్సి వచ్చింది. శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసిన అర్చకులు తెల్లవారుజామున 3.15 గంటలకు తిరిగి తెరుస్తారు. దాదాపు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. అర్ధరాత్రి 1.05 నుండి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుండగా గ్ర‌హ‌ణం అనంత‌రం తెల్లవారుజామున 3.05 గంటలకు తిరిగి ఆలయ మహా ద్వారాన్ని తెరుస్తామన్నారు టిటిడి ఇఓ ధర్మారెడ్డి. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి పుణ్యా వచనం, సంప్రోక్షణ, శుద్ధి చేస్తారన్నారు. అనంతరం తోమాల, అర్చన సేవలతో కైకర్యాలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. తోమాల అర్చన సేవలు జరిగే సమయంలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులను అనుమతిస్తామన్నారు. ఆలయం తలుపులు మూసి వేసే దాకా 42 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ప్రస్తుతం 19 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారని చెప్పారు. అన్నదానం కూడా మూసి వేశామని, భక్తులకు ఇబ్బంది లేకుండా ముందుగానే ఆహార పొట్లాలను భక్తులకు అందించామన్నారు టిటిడి ఇఓ ధర్మారెడ్డి. చంద్రగ్రహణంతో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సాయంత్రం 6 గంటలకు మూసివేసిన టిటిడి అధికారులు రేపు ఉదయం 9 గంటలకు తెరవనున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :