Saturday, 18 May 2024 09:22:43 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దసరాకు 620 స్పెషల్ ట్రైన్లు

Date : 18 October 2023 10:56 AM Views : 72

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ప్రభుత్వాలు దసరా సెలవులు కూడా ప్రకటించాయి. ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ప్రతీయేట దసరా పండుగకు స్వస్థలాలకు వెళుతుంటారు. ఈసారి కూడా సొంతూర్లకు వెళ్లే వారి సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటుంటారు. అయితే పండగ నేపథ్యంలో నెల రోజులు ముందుగానే రిజర్వేషన్‌ భోగీలలోని సీట్లన్నీ బుక్‌ అయ్యిపోతాయి. దీంతో పండుగకు ఇళ్లకు పోయేవాల్లకు సీట్లు దొరకడం కష్టంగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 620 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. దసరా రద్దీని నివారించేందుకు ఈ మేరకు ఈ ప్రత్యేక రైళ్లను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో తెలంగాణలోని కాచిగూడ, లింగంపల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్ సహా ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, తిరుపతి, రాజమండ్రి సహా పలు ప్రాంతాల నుంచి ప్రయాణికుల రాకపోకలు అధికంగా సాగిస్తుంటారు. దీంతో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబరు 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తన ప్రకటనలో దక్షిణ మధ్య రైల్వే వివరించింది. అక్టోబర్ 20 వ తేదీ నుంచి 29వ తేదీ మధ్య కాకినాడ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, పిడుగురాళ్ల, రెండు రూట్లలో సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, నల్గొండ, మిర్యాలగూడ, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల మధ్య నడుస్తాయి. Nithari Murder Case: నిఠారీ సీరియల్‌ మర్డర్‌ కేసుల్లో అల్హాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు.. ఉరి శిక్ష రద్దు! ఇక మరోవైపు ప్రయాణికుల అభ్యర్థనల మేరకు ఏపీకి ప్రత్యేక బస్సులను జూబ్లీ బస్ స్టేషన్ (JBS) మీదుగా విజయవాడకు టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ కాకుండా జేబీఎస్ ద్వారా నడపాలని BHEL నిర్ణయించింది. అక్టోబర్ 18 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ తెలిపింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :