జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరపల్లి వద్ద నిర్మించతలపెట్టిన భోగాపురం ఎయిర్ పోర్ట్ కి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.. తొలి దశలో రూ.4952 కోట్లతో పనులు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ని రూ.4952 కోట్లతో నిర్మించబోతున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ పనులను జీఎంఆర్ విశాఖ ఇంటర్నేషనల్ చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ ఎయిర్ పోర్ట్ 4 కోట్ల జనాభాకు సరిపోయేలా డిజైన్ చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా 7 ఎయిరో బ్రిడ్జిలు, కార్గో టెర్మినల్, ఎం ఆర్ వో సెంటర్ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఎ 320, ఎ 380 డబుల్ డెక్కర్ ఫ్లైట్స్ ల్యాండయ్యేలా రన్ వే ఉండబోతోందన్నారు. 2026 ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సపోర్ట్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు, పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. పునరావాసాలు కల్పించాం.. పోర్టు నిర్మాణంలో భాగంగా భూములు ఇచ్చిన 4 గ్రామాల ప్రజలకు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లు కట్టించి పునరావాసం కల్పించామని సీఎం జగన్ తెలిపారు
Admin