Thursday, 05 December 2024 05:52:17 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

ఎన్నికలే టార్గెట్‌గా స్పీడు పెంచుతోన్న వైసీపీ.. బస్సు యాత్రలతో పార్టీ శ్రేణుల్లో జోష్..

Date : 17 November 2023 12:01 AM Views : 194

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఏపీలోని మూడు ప్రాంతాల నుంచి మొదలైన సామాజిక సాధికార బస్సు యాత్రల్లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు. ఏపీ ప్రభుత్వ విధాన నిర్ణయాల్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. ప్రధానంగా.. జగన్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మేలును వివరిస్తున్నారు. ఇక.. రెండో దశలో రెండో రోజు.. విజయనగరం జిల్లా రాజాం, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గాల్లో బస్సుయాత్రలు నిర్వహించారు వైసీపీ నేతలు. రాజాం ఎమ్మెల్యే కంభాల జోగులు ఆధ్వర్యంలో జరిగిన బస్సుయాత్రలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముందుగా బొద్దాంలో నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించి.. బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం.. రాజాం బస్సు యాత్ర బహిరంగ సభలో ప్రసంగించారు వైసీపీ ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా.. వచ్చే ఎన్నికల్లో పొరపాటు చేస్తే మళ్ళీ రాష్ట్రం దోపిడీ దొంగల చేతిలోకి వెళ్తుందని.. అందుకే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఏపీ శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం. ఇంటికో జాబు ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ పేరుతో యువకుల జేబులు కొట్టేశారని ఆరోపించారు. మరోవైపు.. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సుయాత్ర కొనసాగింది. రావులపాలెంలో మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీ నేతలు.. అక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్ల మేర బస్సు యాత్ర చేశారు. అనంతరం.. కొత్తపేట సెంటర్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు. నాలుగున్నరేళ్లలో మంచి చేస్తేనే ఓటెయ్యామని ప్రజల్ని అడుగుతున్న నేత సీఎం జగన్‌ అన్నారు మాజీ మంత్రి కన్నబాబు. టీడీపీ, జనసేన పార్టీలు.. ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా వ్యవహరిస్తూ.. ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :