Saturday, 18 May 2024 01:11:23 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఏపీ యూనివర్సిటీల్లో 3,220 పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్‌ విడుదల

Date : 21 October 2023 08:47 AM Views : 70

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో 3,220 ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శుక్రవారం (అక్టోబ‌రు 20) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 యూనివర్సిటీలు ఉండగా వాటిల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 1,629, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 654, ప్రొఫెసర్ ప్రొఫెసర్‌ పోస్టులు 415, బ్యాక్‌లాగ్‌ పోస్టులు 278, బోధనేతర పోస్టులు 24, రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో 220 లెక్చరర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ ఈ రోజు విడుదల చేసే నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనుంది. శనివారం (అక్టోబ‌రు 21) నుంచి దరఖాస్తుల కూడా ప్రారంభం అవుతుంది. రేపట్నుంచి మూడు వారాల పాటు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి పోర్టల్‌ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు మాత్రం అన్ని పోస్టులకు కలిపి ఒకే దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు. తొలుత ఏపీపీఎస్సీ స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహిస్తుంది. దరఖాస్తు స్వీకరణ నుంచి ఏపీపీఎస్సీ స్క్రీనింగ్‌ పరీక్ష వరకు మొత్తం 45 రోజుల సమయం ఉంటుంది. ఈ పరీక్షలో అర్హులైనవారి వారిని 1 : 12 చొప్పున ఎంపిక చేసి అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా 1 : 4 చొప్పున మౌఖిక ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇప్పటికే యూవర్సిటీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నవారికి ఇంటర్వ్యూ సమయంలో అనుభవానికి గానూ ఏడాదికి ఒక పాయింటు చొప్పున గరిష్ఠంగా 10 పాయింట్లు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,282 ఆచార్యుల పోస్టుల భర్తీకి ఈ రోజు ప్రకటన వెలువరిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య కె హేమచంద్రారెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వీటితో పాటు మరో 70 పోస్టులను డిప్యుటేషన్‌పై తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తన ప్రకటనలో వెల్లడించారు. ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడహాక్‌ ఆచార్యులకు పది శాతం మార్కులు వెయిటేజీ ఇవ్వాలని సీఎం నిర్ణయించారని ఆయన తెలిపారు. ఇక బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి కూడా బోధన సిబ్బంది నియామకంలో అనుసరిస్తున్న రేషనలైజేషన్‌ విధానాన్నే అనుసరిస్తామని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్‌ వెలువడుతుందా అని ఎదురు చూస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :