Saturday, 18 May 2024 10:28:12 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

స్కిల్‌ కేసులో రెండు కీలక పిటిషన్లపై హైకోర్టు విచారణ.. కీలకంగా మారనున్న చంద్రబాబు హెల్త్‌ రిపోర్ట్‌

Date : 27 October 2023 11:00 AM Views : 73

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : చంద్రబాబు పిటిషన్లపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. క్వాష్‌ పిటిషన్‌పై తీర్పును ఇంకా రిజర్వులోనే పెట్టింది సుప్రీం. మిగతా కేసులు, పిటిషన్లలోనూ వాయిదాలపర్వం కంటిన్యూ అవుతోంది. ఈనేపథ్యంలోనే స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హై కోర్టు ఇవాళ విచారణ చేయనుంది. దీనిపై ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 19న హైకోర్టులో ఈ పిటిషన్‌ పై వాదనలు జరిగాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని సరైన టెస్టులు చెయ్యటం లేదని మెమో దాఖలు చేశారు చంద్రబాబు తరుఫు న్యాయవాదులు. సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ లో ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, తదుపరి వాదనలు దసర తర్వాతకు వాయిదా వేసింది. దీంతో చంద్రబాబు తరుపు న్యాయావాదులు వెకేషన్ బెంచ్‌కు వేయాలని కోరారు. దాన్ని అంగీకరించిన హైకోర్ట్ వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను అక్టోబర్ 27నాటి విచారణకు కోర్టు ముందు ఉంచాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగార అధికారులను ఆదేశించింది కోర్టు. దీనిపై ఇవాళ వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, మధ్యంతర బెయిల్‌ విచారణ జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్‌ ముందు 8వ కేసుగా లిస్ట్ అయింది. మరోవైపు ఏపీ హై కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు తరుపు న్యాయవాదులు. ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ వెకేషన్ బెంచ్ ముందుకు మధ్యంతర బెయిల్ పిటిషన్ వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా మధ్యతర బెయిల్ మంజూరు చేయాలని అధికారులను కోరుతూ పిటిషన్ వేశారు. హెల్త్ రిపోర్ట్‌లను అటాచ్ చేస్తూ కంటికి ఆపరేషన్ చేయాలంటూ మద్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మూడు నెలల క్రితమే చంద్రబాబు ఎడమ కంటికి ఆపరేషన్‌ జరిగిందని రిపోర్ట్‌లు అటాచ్‌ చేశారు న్యాయవాదులు. కుడి కంటికి కూడా ఆపరేషన్‌ చేయాల్సి ఉందంటున్నారు బాబు లాయర్లు. చంద్రబాబు ఆరోగ్యంపై ఇప్పటికే మెమో వేసింది సీఐడీ. అయితే ఇవాళ్టి విచారణలో చంద్రబాబు హెల్త్‌ రిపోర్ట్‌ కీలకంగా మారనుంది. ఇక సుప్రీం కోర్ట్‌లో క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ లో ఉన్నందున నేడు హై కో‌ర్ట్‌లో విచారణపై ఉత్కంఠ నెలకొంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :