Saturday, 18 May 2024 12:36:42 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మరో 2 నెలల్లో ఇంటింటికి తాగునీరు.. మారుమూల గ్రామాలకూ కొత్త రోడ్లు

Date : 17 October 2023 06:37 PM Views : 110

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతంం కొత్త రోడ్లు నిర్మించినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. మరో రెండు నెలల్లో ప్యాపిలి మండలంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించనున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ప్యాపిలిలోని రూ.5.5 కోట్లతో నిర్మించిన సరికొత్త రహదారులను ఆయన మంగళవారం ప్రారంభించారు. గార్లదిన్నె నుంచి అలేబాదు వరకు రూ.3 కోట్ల నిధులతో 4 కి.మీ మేర కొత్త రోడ్డుకు సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవిష్కరించారు. మునిమడుగు నుంచి అలేబాదు తండా వరకు రూ.2.5కోట్లతో 5 కి.మీ మేర నూతన రహదారిపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాదయాత్ర చేస్తూ ముందుకు సాగారు బుగ్గన. ప్యాపిలి ప్రారంభోత్సవాల పర్యటనలో భాగంగా మునిమడుగు గ్రామానికి చేరుకున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్థానిక జనం ఘన స్వాగతం పలికారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి పాదయాత్ర చేపట్టారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా గార్ల దిన్నె, మునిమడుగు, అలేబాదు, అలేబాదు తాండ ప్రజలతో కలిసి నడుస్తూ ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డోన్ నియోజకవర్గం వ్యాప్తంగా నీటి సమస్య త్వరలోనే తొలగిపోతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భరోసా ఇచ్చారు. వర్షం వచ్చినా రాకున్నాఇబ్బంది కలగని విధంగా డిసెంబర్ కల్లా పైప్ లైన్ ద్వారా గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ప్యాపిలిలో ఇంటింటికి పుష్కలంగా తాగునీరు అందిస్తామన్నారు. అలేబాద్ గ్రామంలోని సింగిల్ విండో ఛైర్మన్ బాలయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :