Saturday, 04 May 2024 07:34:43 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

పోలీసుల తీరుపై జనసేన కార్యకర్తల ఆగ్రహం

Date : 05 November 2022 02:51 PM Views : 385

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / గుంటూరు జిల్లా : ఏపీ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను మంగళగిరి ఇప్పటం వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. పవన్ కల్యాణ్ కాన్వాయ్ ను ఆపేశారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. పవన్ కల్యాణ్ వెంటనే కారు దిగి కార్యకర్తలతో కలిసి ఇప్పటం వెళ్లారు. పోలీసుల తీరుపై జనసేన కార్యకర్తలతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన, టీడీపీ కార్యకర్తలకు చెందిన.. 53 ఇళ్లు, ప్రహారీ గోడలు కూల్చివేశారు. జనసేన మీటింగ్ కుస్థలం ఇచ్చారనే కారణంగా కార్యకర్తల మీద కక్ష సాధిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు. ఇప్పటంలోని బాధితులను పరామర్శించేందుకు పవన్ ఇవాళ ఇప్పటం బయల్దేరారు. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. సరిహద్దులో ముళ్ల కంచెలు పెట్టారు. పోలీసుల తీరుపై జనసేన కార్యకర్తలు పలుచోట్ల ఆందోళనలకు దిగారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పవన్ కల్యాణ్ ఇప్పటం వెళ్లి బాధితులను పరామర్శించారు. గ్రామంలో పవన్ కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కూల్చివేతలపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చిన్న గ్రామంగా ఉన్న ఇప్పటంలో రోడ్ల విస్తరణ ఏంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజలంతా పూజించే నంది విగ్రహాన్ని, పీవీ నరసింహ రావు విగ్రహన్ని తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గ్రామం ఏమైనా కాకినాడా, రాజమండ్రా అని ప్రశ్నించారు. వైసీపీ ఇలాగే చేస్తే మేం ఇడుపులపాయలో హైవే వేస్తామని హెచ్చరించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :