Saturday, 18 May 2024 11:57:35 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

చిట్​ ఫండ్​ కేసులో టీడీపీ ఎమ్మెల్యే భర్త, మామ అరెస్ట్

Date : 30 April 2023 04:43 PM Views : 120

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి అరెస్ట్ సంచలనంగా మారింది. వాసుకు చెందిన చిట్ ఫండ్ కంపెనీల్లో కొద్ది రోజులుగా సీఐడీ సోదాలు చేస్తోంది. చిట్ ఫండ్ వ్యవహారాల్లో అవకతవకల ఆరోపణలపై ఈ చర్యలు తీసుకుంది. అదిరెడ్డి వాసుతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని రాజమండ్రి సీఐడీ కార్యాలయానికి తరలించారు.2022 ఆగస్టులో చేసిన మోసాలపై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు వాసులపై కేసు నమోదైంది. చిట్​ ఫండ్​ చట్టంలోని నిబంధనలే ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. చిట్టి పాడుకున్న సొమ్ముకు .. వారికి ఇచ్చిన డబ్బుకు తేడాలు ఉన్నాయని గుర్తించారు. బ్యాంక్​ చెక్కు చూపించి.. చిట్టీలు పాడుకున్న వ్యక్తికి మరో విధంగా డబ్బులు ఇచ్చారని బాధితులు ఫిర్యాదు చేశారు. రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబీకులు చిట్‌ఫండ్‌ నిర్వహిస్తున్నారు. అయితే, ప్రజల నుంచి చిట్స్‌ వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారనే విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో జగజ్జనని చిట్‌ఫండ్‌ మోసాలపై సీఐడీకి కాకినాడ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నకిలీ ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడినట్టు, చిట్స్‌ చెల్లింపుల్లోనూ అక్రమాలకు పాల్పడినట్టు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ గుర్తించి సీఐడీకి ఆధారాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల డబ్బులను దుర్వినియోగం చేసినట్టు, ఫాల్స్‌ డిక్లరేషన్‌ను అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ గుర్తించారు. 49 సబ్‌స్కైబర్‌ల వివరాలను తనిఖీ చేసి ఆధారాలిచ్చారు. డాక్యుమెంట్ల నిర్వహణలోనూ ఆక్రమాలను గుర్తించారు. నిబంధనలకు విరుద్దంగా చిట్‌ఫండ్‌ నిధులతో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించడంతో 1982 చిట్‌ ఫండ్‌ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్టు తెలిపారు. దీంతో, జగజ్జనని చిట్‌ఫండ్స్‌ డైరెక్టర్లు ఆదిరెడ్డి, వాసులను సీఐడీ అరెస్ట్‌ చేసింది. 2022 నవంబర్‌ నుంచి రాష్ట్రంలో చిట్‌ఫండ్‌ కంపెనీల్లో రిజిస్ట్రేషన్‌ శాఖ తనిఖీలు చేపట్టింది. మార్చి 16న జగజ్జనని చిట్స్‌ సహా రాష్ట్రంలో పలు చిట్‌ఫండ్‌ సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వెలుగు చూసిన అంశాల ఆధారంగా సీఐడీకి అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేశారు​

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :