జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : విజయనగరం రైలు ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది చనిపోగా.. 100 మందికి పైగా ప్రయాణీకులు గాయాలపాలయ్యారు. మరో ఐదుగురి పరిస్థితి విషయంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మరికాసేపట్లో కంటకాపల్లి ఘటనాస్థలికి వెళ్లనున్నారు. రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రైలు ప్రమాదం.. 14 రైళ్లు రద్దు.. ఐదు దారి మళ్లింపు రద్దైన రైళ్లు.. 30 అక్టోబర్ – రైలు నం. 08527 – రాయ్‌పూర్-విశాఖపట్నం ప్యాసింజర్ 30 అక్టోబర్ – విశాఖపట్నం నుండి – రైలు నం. 08528 – విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్యాసింజర్ 30 అక్టోబర్ – పలాస నుండి – పలాస-విశాఖపట్నం స్పెషల్ 30 అక్టోబర్ – పారాదీప్ నుండి – పారాదీప్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ 30 అక్టోబర్ – కోర్బా నుండి – కోర్బా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ 30 అక్టోబర్ – రాయగడ నుండి – రాయగడ-విశాఖపట్నం ప్యాసింజర్ 30 అక్టోబర్ – విజయనగరం నుండి – విజయనగరం-విశాఖపట్నం స్పెషల్ 30 అక్టోబర్ – విశాఖపట్నం నుండి – విశాఖపట్నం-గుణపూర్ స్పెషల్ రైలు ప్రమాదంపై సీఎం జగన్‌తో మాట్లాడిన అశ్విని వైష్ణవ్ రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి చెందారు. రైల్వేమంత్రి అశ్వినివైష్ణవ్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రైలుప్రమాదంపై సీఎం జగన్‌తో ఫోన్‌లో మాట్లాడారు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్. ఘటనాస్థలిలో సహాయక చర్యల వివరాలను మంత్రికి తెలిపారు సీఎం జగన్ రైలు ప్రమాద ఘటనలో ముమ్మరంగా కొనసాగుతోన్న సహాయక చర్యలు.. రైలుప్రమాద స్థలంలో సహాయకచర్యలను దగ్గురండి పర్యవేక్షించారు మంత్రి బొత్స సత్యనారాయణ.. రైలుప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి. రైలు ప్రమాదధాటికి బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. సాయం కోసం బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.రైలుప్రమాదంలో మృతిచెందిన వారి డెడ్‌బాడీలను ఒక్కొక్కటిగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు అధికారులు. రైలుప్రమాద స్థలంలో బాధితులకు కొనసాగుతున్న సహాయకచర్యలను దగ్గురండి పర్యవేక్షించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.. రైలు ప్రమాదంలో లోకో పైలెట్ ఎంఎస్ రావులుతోపాటు ట్రెయిన్ గార్డ్ మృతి చెందడంపై రైల్వే ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మెరుగైన వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. Update: 14 మంది మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం.. విజయనగరం జిల్లాలో విశాఖ-పలాస ప్యాసింజర్‌ను విశాఖ-రాయగడ రైలు ఢీకొట్టడంతో 7 బోగీలు పట్టాలు తప్పి నుజ్జు నుజ్జు అయ్యాయి. కొత్తవలస మండలం కంటకాపల్లి దగ్గర జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది చనిపోగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. రైలు ప్రమాదంలో మృతి చెందినవారు వీరే.. విజయనగరం రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారిలో గిడిజాల లక్ష్మీ, కంచు బాకత్ రవి, చల్లా సతీష్, లోకో పైలట్ ఎస్ ఎం రావు, కరణం అక్కల నాయుడు, నాగరాజు, టి. సుగుణమ్మలుగా గుర్తించారు అధికారులు. మృతులు అంతా ఉత్తరాంధ్రకు చెందిన వారేనని తెలుస్తోంది. కాగా, మృతదేహలను పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంటకాపల్లి రైలు ప్రమాదం.. కొనసాగుతోన్న సహాయక చర్యలు.. కంటకాపల్లి రైలు ప్రమాదంలో గాయపడిన బాధితురాలు కుమారి విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాలు ప్రాక్చర్ కావడంతో కుమారికి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో సర్జరీ చేశారు. పలాస ప్యాసింజర్ రైలులో విశాఖ నుంచి అలమండ వెళ్తూ ప్రమాదానికి గురైంది బాధితురాలు. తీవ్ర గాయాలతో భోగిపై ఇరుక్కుపోయింది కుమారి. ఫోన్ కాల్‌తో ఘటనా స్థలికి ఆమె బంధువులు చేరుకోగా.. గంటన్నర పాటు శ్రమించిన సిబ్బంది.. స్థానికుల సహకారంతో కుమారిని పైకి తీశారు. కిలోమీటర్ వరకు ఆర్పిఎఫ్ అధికారి కుమారిని మోసుకెళ్లారు. ప్రభుత్వ అధికారుల సహాయం మరువలేనిదని.. చిమ్మ చీకటిలోనూ స్థానికులు నిర్విరామంగా శ్రమిస్తూ ఉన్నారు కుమారి బంధువులు తెలిపారు. రైలు ప్రమాద ఘటన వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ విజయనగరం రైలు ప్రమాద ఘటన వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదానికి గురైన రైలు భోగీలను రెస్క్యూ చేస్తున్నారు రైల్వే సిబ్బంది. పదికి పైగా భారీ క్రేన్లు ఘటనాస్థలానికి చేరుకోగా.. సుమారు పన్నెండు గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు అధికారులు. 14కి చేరిన మృతుల సంఖ్య.. 100 మందికి గాయాలు.. కంటకాపల్లి రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కి చేరింది. 100 మంది గాయాలపాలయ్యారు. సహాయక చర్యలు పూర్తయితే.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు 10 మృతదేహాలను వెలికితీయగా.. బోగీల మధ్య నలిగిపోయిన మృతదేహాలను ఇంకా తీయాల్సి ఉందని తెలుస్తోంది. కంటకాపల్లి రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కి చేరింది. సహాయక చర్యలు పూర్తయితే.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు 10 మృతదేహాలను వెలికితీయగా.. బోగీల మధ్య నలిగిపోయిన మృతదేహాలను ఇంకా తీయాల్సి ఉందని తెలుస్తోంది. బాధితులకు సహాయం, సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. బాధితుల సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157, రైల్వే కార్యాలయంలో 8978080006 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు. అలాగే బాధితులకు సంబంధించి సమాచారం కోసం.. 0891 2746330, 0891 2744619 నెంబర్లకు ఫోన్ చేయాలని రైల్వే అధికారులు సూచించారు. రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించారు. మృతుల్లో ఏపీకి చెందిన వారికి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల సహాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. మృతుల్లో ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉంటే రూ.2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50వేల చొప్పున సహాయం చేస్తామని ప్రకటించారు. మరోవైపు మృతులకు కేంద్రం తరఫున రూ.10 లక్షల పరిహారం అందిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50,000 అందిస్తామన్నారు. రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడిన ప్రధాని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అసలేం జరిగిందంటే... విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం పట్టాలపై ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఆగి ఉండగా వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 5 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందగానే ఎన్డీఆర్‌ఎఫ్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అటు ప్యాసింజర్ రైలు కావడంతో ప్రయాణికుల వివరాలు తెలుసుకోవడం అధికారులకు కష్టంగా మారింది.
Admin