Saturday, 18 May 2024 10:51:44 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఒక్క షేక్‌హ్యాండ్‌.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది.. పవన్, నాని కలయిక వెనుక ఇంత అర్ధముందా?

Date : 26 October 2023 10:28 AM Views : 86

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఒక్క షేక్‌హ్యాండ్‌.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ముఖ్యంగా గుడివాడలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బద్ద శత్రువుల్లాంటి ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు ఇలా హ్యాపీగా నవ్వుతూ కరచాలనం చేసుకోవడం చాలామందిని అర్ధం కాట్లేదు. అటూ.. ఇటూ.. వార్‌ అయితే కంటిన్యూ అవుతోంది. ఒక పెళ్ళి వేడుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. వంగవీటి రాధా పెళ్లి.. సరికొత్త చర్చకు దారి తీసింది. ఆయన పెళ్లికి హాజరైన సమయంలో కనిపించిన సీన్స్‌ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, మాజీ మంత్రి,. వైసీపీ నేత కొడాలినాని.. ఈ ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం.. పైగా షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు ఇలా మెలగడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపిచింది కూడా. అయితే గుడివాడలో మాత్రం పొలిటికల్‌గా దుమారం రేగింది. మాజీ మంత్రి కొడాలిపై టీడీపీ, జనసేన నేతలు మండిపడ్డారు. కేవలం పవన్‌తో కరచాలనం కోసం.. నాని ఎంతకు దిగజారారో అంతా చూశారని ఆరోపించారు నేతలు. పవన్‌ చుట్టూ అభిమానులున్నా.. కొడాలి నాని మాత్రం వారిని తోసుకుంటూ వెళ్లి పవన్‌తో చెయ్యి కలిపారని మండిపడ్డారు. అయితే వంగవీటి రాధా పెళ్లికి వివిధ పార్టీల నేతలను ఆహ్వానించారు. తనకు సన్నిహితులైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పెళ్లికి పిలిచారు. అంతేకాదు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. కొడాలి నాని.. అప్పటికే పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఆయన వంగవీటి రాధాను కంగ్రాట్స్‌ చెప్పేందుకు స్టేజ్‌ ఎక్కేలోపే పవన్‌ కల్యాణ్‌ రావడం జరిగింది. ఇద్దరూ ఎదురెదురుగా రావడంతో.. ముందు కొడాలి నాని నమస్కారం చేశారు.. అది చూసి పవన్‌ ప్రతి నమస్కారం చేసి.. కరచాలనం కోసం చేయి ఇచ్చారు. దీంతో నాని కూడా ముందుకు కదిలి చేయి కలిపారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అటు జనసేన వారు పవన్‌తో షేక్‌ హ్యాండ్‌ కోసం నాని ఎగబడ్డారంటే.. నానితో పరిచయం కోసం పవన్‌ చేయి ఇచ్చారంటూ ఎవరికి నచ్చిన పోస్టులు వారు పెడుతున్నారు. అయితే పెళ్లికి వచ్చిన అతిథులు ఎదురుపడితే ఇలా నమస్కరించుకుని.. షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం కనీస సంస్కారం అంటూ మరికొందరు స్పందించారు. తెలుగు దేశం పార్టీ – జనసేన పార్టీలు మాత్రం కొడాలి నాని టార్గెట్‌ గానే ఆరోపణలు చేస్తున్నాయి. అసలు కొడాలి ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలంటూ జనసేన అంటోంది. రెండు బస్సులతో రెండు కోట్ల బెంజ్‌ కారు ఎలా కొన్నావంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :