Saturday, 18 May 2024 11:19:42 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

అన్‌స్టాపబుల్‌ పొలిటికల్ డైలాగ్స్‌.. రచ్చ లేపుతోన్న బాలయ్య

Date : 16 October 2023 10:00 AM Views : 72

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : మేం తప్పు చేయమని మీకు తెలుసు. మేం తలవంచమనీ మీకు తెలుసు.. మమ్మాపడానికి ఎవరూ రాలేరని మీకు తెలుసు… అనిపించింది అందాం, అనుకున్నది చేద్దాం, ఎవ్వడాపుతాడో చూద్దాం. జనరల్‌గా ఈ డైలాగ్‌ను వేరెవరైనా చెబితే.. అది పక్కా సినిమా డైలాగ్‌ అనో, ప్రోగ్రామ్‌ కోసం చేశారనో అనుకుంటాం. కాని, ఈ డైలాగ్ వచ్చింది బాలకృష్ణ నుంచి. సో, కచ్చితంగా ఇన్నర్‌ మీనింగ్‌ వేరే. అదెలా చెప్తారు అనే డౌటే అక్కర్లేదు. ఎందుకంటే.. ఇదే ప్రోమోలో మరో డైలాగ్‌ కూడా ఉంది. అది విన్నాక ఇక కన్ఫామ్‌ అవొచ్చు. ‘సినిమాలో అయినా, లైఫ్‌లో అయినా.. అంతా బాగున్నప్పుడే ఒకడు దిగుతాడు, సర్వం నాశనం చేయడానికి బయల్దేరతాడు, మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటికి రావాలి’. ఇదీ ఆ డైలాగ్. బాలకృష్ణ డైలాగ్‌లో చంద్రబాబు, జైలు, కోర్టులు, ఏపీ రాజకీయాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో, పొలిటికల్‌ సెటైరిక్ డైలాగ్ కాదని ఎవరైనా చెప్పగలరా. ఇలాంటి ప్రోగ్రామ్‌లో పొలిటికల్‌ టచ్ ఇవ్వడం బాలయ్యకు కామన్‌ అయిపోయింది. చంద్రబాబు గెస్ట్‌గా వచ్చిన షోలో కూడా ఇలాంటిదే కనిపించింది. మీరు తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఏంటి అని బాలయ్య ప్రశ్నించినప్పుడు.. 1995 నిర్ణయం అని చంద్రబాబు సమాధానం ఇస్తారు. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా అని చంద్రబాబు, ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది బావా అంటూ బాలయ్య.. మొత్తంగా ఈ డైలాగ్స్ అన్నీ అప్పట్లో బాగా వైరల్‌ అయ్యాయి. బాలకృష్ణ చేసిన షోలో డైలాగ్స్ అన్నీ డైరెక్టుగానే పేలాయి. కాని, లేటెస్ట్ ప్రోమోలో మాత్రం ఖాళీలు మీరే పూరించండి అనే క్వశ్చన్ మార్క్‌ పెట్టారు. జనరల్‌గా బాలయ్య అనుకుంటే డైరెక్ట్‌ అటాకే చేస్తారు. బ్రో.. ఐ డోంట్‌ కేర్‌ అనగలిగిన వ్యక్తి బాలయ్య. ఈమధ్య జూనియర్ ఎన్టీఆర్‌ గురించి డైరెక్టుగా బాలకృష్ణనే అడిగేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై ఎందుకు స్పందించలేదని. దానికి ఐ డోంట్ కేర్‌ అంటూ డైరెక్ట్‌ అటాక్ చేశారు. కాని, ప్రోమో డైలాగ్‌లో మాత్రం చెప్పీ చెప్పకుండా చెప్పడం ద్వారా ఓ మెసేజ్ పంపారు. ఎక్కడా చంద్రబాబు పేరెత్తలేదు. అలాగని సీఎం జగన్ ప్రస్తావన కూడా తేలేదు. కేసుల గురించీ మాట్లాడలేదు. కాని, పంచ్‌లు మాత్రం విసిరారు. సో, ఎవరిని టార్గెట్‌ చేస్తూ అలా అన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాని, చంద్రబాబు అరెస్ట్‌ టాపిక్‌ మరోసారి నలుగురిలో నానేలా చేశారనేది మాత్రం కన్ఫామ్. బహుశా ఆ నాశనం చేసిన వ్యక్తి ఎవరో చెప్పి ఉంటే.. ఇంత పెద్ద డిస్కషన్ జరిగేది కాదేమో. కాని, ఆ వ్యక్తి పేరు చెప్పకుండా జనానికే ఆ గ్యాప్ వదిలేశారు. అనిపించింది అందాం, అనుకున్నది చేద్దాం, ఎవ్వడాపుతాడో చూద్దాం అని ప్రోమోలోనే ఫస్ట్ డైలాగ్ ఉంది. అనిపించింది అందాం అన్న తరువాత కూడా డ్యాష్‌లు పెట్టారంటే అర్థం.. ఓ డిస్కషన్ జరగాలనేనా? ఏమో..! ఒకవేళ బాలయ్య స్ట్రాటజీ అదే అయితే మాత్రం.. ఈ విషయంలో సక్సెస్ అయినట్టే. చూస్తుంటే ఈ షోలో బాలయ్య ఇంకాస్త గట్టిగానే.. అస్త్రాలు సంధించినట్లుగా కనిపిస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :