Thursday, 05 December 2024 06:20:18 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మరో కొత్త పథకానికి సీఎం జగన్ శ్రీకారం.. క్వాలిఫై అయితే లక్షన్నర.. పూర్తి వివరాలివే..

Date : 13 October 2023 12:31 PM Views : 146

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ సంక్షేమ పథకాల పరంపర కొనసాగుతుంది. గడిచిన నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాల నీరాజనాల కోసం ఏదో ఒక సంక్షేమ పథకం ప్రవేశపెడుతున్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాలను పలు పథకాల ద్వారా ఆర్థికంగా ఆదుకుంటున్నారు.. ఇలా అన్ని వర్గాలు తమవారేనని.. ఇది పేదల ప్రభుత్వం అంటూ చెప్పుకొస్తున్నారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారని సీఎం జగన్ చెబుతున్నారు. అంతే కాదు మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చామని కూడా సీఎం జగన్ చెబుతున్నారు. ఇక ఎన్నికలకు ముందు మిగిలిన ఒకట్రెండు కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలే కాకుండా మేనిఫెస్టోలో హామీఇవ్వని పథకాలు కూడా అమలు చేశామని సీఎం జగన్ చెబుతున్నారు. వచ్చే జనవరి నుంచి సామాజిక పెన్షనలను 3 వేల రూపాయలకు పెంచి ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇలా తమ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న సివిల్స్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకం అమల్లోకి తెచ్చారు. జగనన్న సివిల్స్ ప్రోత్సాహక పథకం ఎవరికి? లాభం ఏంటి? జగనన్న సివిల్స్ ప్రోత్సాహక పథకం ప్రవేశపెడుతూ విధివిధానాలతో జీవో ఎంఎస్ 58 ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు ఈ పథకం వర్తిస్తుంది. సివిల్స్ పరీక్షల్లో ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్దులకు వారు మెయిన్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం. ఇక మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులు ఇంటర్వ్యూలకు అవసరమైన కోచింగ్, ఇతర అవసరాల కోసం 50 వేల ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం.. అయితే పథకానికి ఎలాంటి అర్హతలుండాలనే దానిపై జీవోలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన, ఈబీసీ వర్గాలకు పథకం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ప‌థకం పొందేందుకు అర్హతలు ఇవే.. జ‌గ‌న‌న్న సివిల్స్ ప్రోత్సాహం ప‌థకం లబ్ధి పొందడానికి అభ్యర్ధులు తాము సివిల్స్ ప్రిలిమ్స్ లేదా మెయిన్స్‌లో అర్హత సాధించిన‌ట్లు ఫ్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. సివిల్స్ ప‌రీక్షలు క్వాలిఫై అయిన వారికి ప‌థకం వ‌ర్తిస్తుంది. అభ్యర్ధుల కుటుంబాల వార్షిక ఆదాయ‌ప‌రిమితి 8 ల‌క్షల‌కు మించ‌కూడ‌దు. అభ్యర్ధుల కుటుంబాల‌కు 10 ఎక‌రాలలోపు మాగాణి లేదా 25 ఎక‌రాల లోపు మెట్ల భూమి మాత్రమే ఉండాలి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండ‌కూడ‌దు. సివిల్స్ ఫలితాలు విడుద‌లైన 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :