Saturday, 18 May 2024 01:00:02 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

అర్ధవీడు పరిసరాల్లో పెద్దపులి సంచారం .. ఆహారం కోసమే గ్రామాల్లోకి వస్తుందన్న ప్రజలు

Date : 29 October 2023 09:41 AM Views : 91

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : నిన్న అడుగుజాడలు.. నేడు చావుకేకలు.. ప్రకాశంజిల్లా అర్ధవీడు గ్రామాల్లో హడలెత్తిస్తున్న పెద్దపులి.. ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. అయితే రావడం మాత్రం పక్కా.. పాదముద్రలు బట్టి పెద్దపులి అని తేల్చేశారు అటవీశాఖ అధికారులు.. రెండు రోజుల వ్యవధిలో ఓ ఆవు, ఒక గేదెను చంపేసింది పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ప్రకాశంజిల్లా అర్ధవీడు మండలంలో ఇప్పుడు పెద్దపులి సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత కొద్దిరోజులుగా అర్ధవీడు మండలంలోని లక్ష్మీపురం, బోల్లి పల్లె గ్రామాల పరిసర ప్రాంతాలలో పెద్దపులి తిరుగుతూ ఉండడంతో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లక్ష్మీపురం గ్రామ సమీపంలోని మేతకు వెళ్లిన ఓ గేదెపై పెద్దపులి దాడి చేసి చంపితినేసింది.. అంతేకాకుండా బొల్లిపల్లె గ్రామ సమీపంలో కూడా ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పెద్దపులి సంచారం పై నిఘా పెట్టారు. ఇప్పటికే పెద్దపులి తిరుగుతున్న పరిసర ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామాలకు అతి సమీపంలోనే నల్లమల అటవీ ప్రాంతం ఉండడంతో ఆహారం కోసం పెద్దపులి వస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. పెద్దపులి తిరుగుతున్న ప్రాంతాలలో పులి పాదముద్రలను పరిశీలించి స్థానిక గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. సిసి కెమెరాల ద్వారా గుర్తింపు. ఈ ఏడాది జనవరి, అక్టోబర్‌ నెలల్లో అటవీ శాఖ అధికారులు పులి సంచారాన్ని ధ్రువీకరిస్తూ పాదాల ముద్రలను సేకరించారు. రాత్రి వేళల్లో పెద్దపులి సంచారాన్ని కనిపెట్టేందుకు అక్కడక్కడ సిసి కెమెరాలను అమర్చారు. ఓ కెమెరాలో పెద్దపులి జాడలు గుర్తించారు. పెద్దపులి సంచరిస్తూ ఉండడంతో స్థానిక గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జునసాగర్‌ – శ్రీశైలం అభయారణ్యంలో పెద్దపులుల సంఖ్య పెరగడంతో ఆహారంకోసం అభయారణ్యం దాటి వస్తున్నాయని భావించారు. Watch: బారికేడ్ వద్ద విధి నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీ కొట్టిన కారు.. వీడియో వైరల్.. అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో గ్రామాలు ఉండడంతో పెద్దపులి ఆహారం కోసం తిరుగుతూ ఉందని మేత కోసం పశువులను అడవిలోకి పంపవద్దని రైతులకు అటవీ శాఖ అధికారులు సూచించారు… అప్పటి నుంచి కనిపించని పులిజాడలు తిరిగి ఈరోజు అర్ధవీడు మండలం బొల్లిపల్లె గ్రామ శివారులో కనిపించడంతో గ్రామస్థులు హడలిపోతున్నారు. అధికారులు కూడా పాదముద్రలను పరిశీలించి అవి పెద్దపులివిగా నిర్ధారించారు. అర్ధవీడు అటవీప్రాంతంలో తరచూ పెద్దపులి కనిపిస్తుండటంతో పెద్దపులిని పట్టుకుని దూరంగా అడువుల్లో వదిలివేయాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :