Saturday, 18 May 2024 01:59:49 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియామకం

Date : 24 November 2022 06:58 AM Views : 205

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిలను నియమించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా పళ్లం రాజు, ప్రచార కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్, మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా తులసి రెడ్డిని నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఏపీసీసీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. తక్షణమే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఊమెన్ చాందీ, మెయ్యప్పన్, క్రిస్టొఫర్ తిలక్, గిడుగు రుద్రరాజు, కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, పళ్లం రాజు, చింతామోహన్, సుబ్బరామిరెడ్డి, జేడీశీలం, జీవీ హర్షకుమార్, కనుమూరి బాపిరాజు, తులసిరెడ్డి, కొప్పుల రాజు, మస్తాన్ వలి, సిరివెళ్ల ప్రసాద్, ఉషా నాయుడు ఉన్నారు. 18మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 33 మందితో కోఆర్డినేషన్‌ కమిటీని నియమించారు. కో ఆర్డినేషన్‌ కమిటీలో అనుబంధ సంఘాల అధ్యక్షులకు చోటు కల్పించారు. ఇక ఇప్పటివరకు ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా ఎస్.శైలజానాథ్‌ పనిచేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :