Saturday, 18 May 2024 10:51:46 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

శ్రీశైలం దేవస్థానానికి తిరుప‌తి వాసి కారు విరాళం .. ఖరీదు ఎంతంటే..!

Date : 07 November 2023 11:44 AM Views : 85

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. భక్తులు తమ ఇష్టదైవనానికి తోచిన విరాళాలను అందజేస్తుంటారు. ఈ క్రమంలోనే శ్రీశైల దేవస్ధానానికి తిరుప‌తికి చెందిన ఉద‌య్ కుమార్ రెడ్డి అనే భక్తుడు భారీ విరాళం అందజేశాడు. సోమ‌వారం శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ఉదయ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబం దేవస్థానానికి ఎంజీ మోటార్స్ కారు ఆస్ట‌ర్‌ ను విరాళంగా అంద‌జేశారు. మార్కెట్లో ఈ కారు విలువ రూ.15 ల‌క్ష‌లు ఉంటుంది. శ్రీశైలం ఈవో పెద్దిరాజుకు ఉద‌య్ కుమార్ రెడ్డి ఈ కారును అంద‌జేశారు. సోమ‌వారం ఉద‌యం గంగాధ‌ర మండ‌పం వ‌ద్ద వేద పండితులు కారుకు ప్రత్యేక పూజ‌లు చేశారు. కాగా, ఈ కారును దేవస్థానం ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ప్రధాన ఆలయం ఎదురుగల గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానానికి అందజేయగా, ఆలయ పూజారులు వారికి స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజుతోపాటు ఈఈ రామకృష్ణ, ఏఈవో మోహన్‌, స్వామివారి ఆలయ ప్రధానార్చకుడు శివప్రసాద్ పాల్గొన్నారు. విరాళాలు ఇచ్చిన దాతలకు ఆలయ అధికారులు భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు, అందించి సత్కరించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :