జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్. మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడిన పవన్.. మూడు అంశాలపై క్లారిటీ ఇచారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. ఈపరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు పవన్. టీడీపీతో పొత్తు విషయం బీజేపీతో మాట్లాడి.. డిల్లీలో ప్రకటించాలి అనుకున్నా.. వైసీపీ తీరు వల్లే రాజమండ్రిలో ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. Pawan Kalyan: ఏపీ సర్కార్‌పై పవన్ ఫైర్.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల జీతాలు కూడా పక్కదారి పట్టిస్తున్నారంటూ.. వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్. మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడిన పవన్.. మూడు అంశాలపై క్లారిటీ ఇచారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. ఈపరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు పవన్. టీడీపీతో పొత్తు విషయం బీజేపీతో మాట్లాడి.. డిల్లీలో ప్రకటించాలి అనుకున్నా.. వైసీపీ తీరు వల్లే రాజమండ్రిలో ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చాక పొత్తులపై కోఆర్డినేషన్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు పవన్. ఇప్పటికి జనసేన ఎన్డీఏలోనే ఉందని స్పష్టం చేశారు పవన్. కూటమిలో బీజేపీ కచ్చితంగా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జగన్ ఎన్డీఏలో లేరని.. కేవలం ఆయనను ఒక రాష్ట్ర సీఎంగానే కేంద్రం గౌరవిస్తుందని చెప్పారు పవన్. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే నిధులు విడుదల చేసిందని బీజేపీ తనతో చెప్పిందన్నారు పవన్. వారాహి విజయయాత్రలో భాగంగా పెడనలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ ఆటవిడుపు యాత్ర చేశారని ఆరోపించారు మరో మాజీ మంత్రి పేర్నినాని. చంద్రబాబుకోసం రోజుకో మాట, రోజుకో వేషం, రోజుకో పార్టీ మారుస్తున్నారని విమర్శించారు. జగన్‌కు దమ్ముంటే కేంద్రంపై పోరాడాలంటూ పవన్ చేసిన సవాల్ కు కౌంటర్ ఇచ్చారు పేర్నినాని. కాగా IAS, IPS అధికారుల జీతాలు కూడా పక్కదారి పట్టిస్తున్నారని.. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సరైన టైంలో జీతాలు చెల్లించే పరిస్థితి లేదంటూ పవన్ కల్యాణ్ విమర్శించారు. ఉద్యోగ భద్రతపై కాంట్రాక్ట్ ఉద్యోగులకు అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పారు పవన్ కల్యాణ్. నిజామాబాద్‌లో పసుపుబోర్డు సాధించుకున్నారు.. కాని జగన్.. కోకోనట్ బోర్డ్ తీసుకొని రాలేకపోతున్నారని విమర్శించారు.
Admin