Saturday, 18 May 2024 09:22:47 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్‌ అందుకే స్పందించలేదు : రాజీవ్‌ కనకాల

Date : 13 October 2023 12:37 PM Views : 66

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : చంద్రబాబును అరెస్ట్ చేసిన నాటి నుంచి ఏపీ వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తోంది. ఇక చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు మొదలు, ఇతర పార్టీలకు చెందిన వారు సైతం ఖండిస్తూ వచ్చారు. అయితే ఇదే క్రమంలో ఒక్క వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాకవపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతడే నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌. గతంలో టీడీపీకి మద్ధతుగా ప్రచారం చేసిన జూనియర్‌ ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఎంతటి హాట్‌ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో అవనితీ జరిగిందన్న ఆరోపణలతో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులోనే ఉన్నారు. నెల దాటినా చంద్రబాబుకు బెయిల్‌ లభించకపోవడంతో టీడీపీ పోరు బాట పట్టింది. అయితే చంద్రబాబు అరెస్ట్‌పై నందమూరి కుటుంబానికి చెందిన వారందరూ స్పందిస్తే ఒక్క ఎన్టీఆర్‌ మాత్రమే స్పందించలేదు. బహుశా ఈ విషయంపై ఎన్టీఆర్‌ స్పందించకపోవడానికి కారణం ఇదే అయ్యుంటందని నటుడు రాజీవ్‌ కనకాల తాజాగా స్పందించారు. వివరాల్లోకి వెళితే.. చంద్రబాబును అరెస్ట్ చేసిన నాటి నుంచి ఏపీ వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తోన్న విషయం తెలిసిందే. ఇక చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు మొదలు, ఇతర పార్టీలకు చెందిన వారు సైతం ఖండిస్తూ వచ్చారు. అయితే ఇదే క్రమంలో ఒక్క వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాకవపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతడే నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌. గతంలో టీడీపీకి మద్ధతుగా ప్రచారం చేసిన జూనియర్‌ ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ వ్యవహారాలకు అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. నందమూరి కుటుంబ సభ్యులంతా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించినా జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం మౌనంగా ఉన్నారు. దీంతో పార్టీలో జూనియర్‌పై విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్‌ స్పందించకపోవడంపై తాజాగా స్పందించిన బాలకృష్ణ.. సినిమా వాళ్లు స్పందించకపోవడంపై తాను పట్టించుకోనని, ఎన్టీఆర్‌ స్పందించకపోతే ఐ డోంట్‌ కేర్‌ అంటూ ఖరాఖండిగా చెప్పేశారు. ఈ చర్చ ఇలా సాగుతున్న తరుణంలో ఇదే విషయమై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్నేహితుడు రాజీవ్‌ కనకాల స్పందించారు. తాజాగా తన తనయుడి మూవీ లాంచింగ్ సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై స్పందించారు. ఏపీలో జరుగుతోన్న వ్యవహారాలపై ఎన్టీఆర్‌ స్పందించకపోవడానికి వరుస సినిమాలతో తీరక లేకుండా ఉండడమే కారణం అయ్యింటందని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ‘ట్రిపులార్‌ సినిమా, మధ్యలో కరోనా ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్‌ కనీసం నాలుగు సినిమాలు చేసేవారు. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపైనే ప్రస్తుతం జూనియర్‌ దృష్టిసారించారు. పూర్తి సమయాన్ని సినిమాకే కేటాయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన దృష్టి మొత్తం సినిమాలపైనే పెట్టాలని భావించి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను’ అని రాజీవ్‌ కనకాల చెప్పుకొచ్చారు. ఇక తాను రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారన్న ప్రశ్నకు బదులిచ్చిన రాజీవ్‌.. తాను రాజకీయాలకు సమయం కేటాయించాగలనని అనుకున్నప్పుడు కచ్చితంగా వస్తానని చెప్పుకొచ్చారు. అయితే రాజకీయాల్లోకి రావాలంటే అధ్యయనం చేయాలన్నారు. అవేవీ చేయకుండా రాజకీయాలు మొదలు పెట్టడం కుదరదన్న రాజీవ్‌ కనకాల.. ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని, వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయని బదులిచ్చారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :