Saturday, 04 May 2024 09:42:00 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

సిద్ధ వైద్యం కోసం వెళ్లిన పేషేంట్ మిస్సింగ్.. పోలీసు విచారణలో దిమ్మతిరిగే నిజాలు.. అక్కడన్నీ అస్తిపంజరాలే..

Date : 25 November 2023 08:17 AM Views : 110

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని చోళపురంలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది.. కేశవమూర్తి అనే సిద్దవైద్యుడు దశాబ్దం నుంచి సిద్ధ వైద్యం పేరుతో చికిత్స ప్రజలకు చేస్తున్నాడు. పరిసర ప్రాంతాల్లో అతనిది మంచి హస్తవాసి అనే పేరుంది. అదే నిజమని నమ్మి చాలామంది అతని వైద్యం కోసం క్యూ కట్టడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే చోళపురానికి సమీప గ్రామస్తుడు అశోక మూర్తి అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు అశోక మూర్తి కుటుంబ సభ్యులు. ఇంట్లో నుంచి అశోక మూర్తి చివరగా ఎక్కడకు వెళ్లారనేది కుటుంబ సభ్యులను పోలీసులు అడుగగా సిద్ధ వైద్యం కోసం చోళపురం వెళ్లినట్టుగా పోలీసులకు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సిద్దవైద్యుడిని విచారించగా అశోక్ అనే పేరుతో ఎవరూ రాలేదని చెప్పాడు. అయితే, సిద్ధ వైద్యుని మాటల్లో తేడాను గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్ తెప్పించారు. ఆస్పత్రి ఆవరణలో అనుమానాస్పదంగా దుస్తుల అనవాళ్లను బయటపడ్డాయి. దాంతో పోలీసులకు అనుమానం పెరిగింది. ఆ ప్రాంతంలో తవ్వడం మొదలు పెట్టారు. ఓ అస్థిపంజరం ఆనవాళ్లు కనిపించాయి. పూర్తి మృతదేహం కనిపించక పోవడంతో తవ్వకాలను కొనసాగించిన పోలీసులకి మైండ్ బ్లాంక్ అయ్యింది. అక్కడ ఇంకా అస్థిపంజరాలు బయట పడుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి జరుపుతున్న తవ్వకాల్లో అనేక అస్థిపంజరాల తాలూకు ఆనవాళ్లు బయట పడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ ఏ ఒక్క అస్థిపంజరం కూడా పూర్తిగా లేదు. తల, కాళ్ళు, మరి కొన్ని ఎముకలు మాత్రమే ఉన్నాయి. రేపు కూడా తవ్వకాలు జరపాలని పోలీసులు నిర్ణయించారు. అయితే వైద్యం కోసమని తన వద్దకి వచ్చిన వారు ఎందుకు హత్యకు గురయ్యారు అనేది మిస్టరీ. సిద్ధ వైద్యం పేరుతో కేశవ మూర్తి క్షుద్ర పూజలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే హత్యలకు మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. అయితే అశోక మూర్తి కాకుండా మిగిలిన అస్థిపంజరాలు ఎవరివి అన్నది ఇంకా తెలియలేదు. చికిత్స కోసమని వెళ్లి మిస్సయిన వారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :