జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు అంటేనే పేరుకు తగ్గట్టుగా ఆయన నిర్ణయాలు సంచలనాత్మకంగా, ఆచరణయోగ్యంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ప్రతీరోజు ఆయన పాల్గొనే కార్యక్రమాలను చూస్తే ఆయన పనితీరు ఏమిటో ఇట్టే అర్ధమవుతుంది. కాలుష్య నివారణపై కలెక్టర్ డిల్లీరావు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఏదైనా మనం ఆచరించినప్పుడే ఎదుటివారికి చెప్పడంలో అర్ధం ఉంటుందన్న భావనతో వాహనాల వినియోగంలో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ దగ్గర నుంచి సిబ్బంది వరకు వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని మాత్రమే వాడాలని, తాను కూడా విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని ఉపయోగిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలుష్య వాతావరణాన్ని నియంత్రించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలను చైతన్య చేయడమే లక్ష్యం అన్నారు. వ్యక్తి గత అవసరాలకు కారును ఉపయోగించకుండా విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని ఉపయోగించాలని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో పని చేసిన జిల్లా కలెక్టర్లు ఒక వాహనాన్ని ఉపయోగించటంతో పాటు వారివ్యక్తి గత అవసరాలు పనులకు మరో వాహనాన్ని వినియోగిస్తుంటారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీ రావు పిల్లలను ఉదయం సాయంత్రం స్కూల్‌కు తీసుకు వెళ్ళడం తీసుకురావడంతో పాటు నగరంలో షాపింగ్ పనులు యితర అవసరాలకు ఒక కార్‌ను వినయోగిస్తున్నారు. పర్యావణాన్ని పరిరక్షించేందుకు వాహన కాలుష్యాన్ని నివారించే చర్యలలో భాగంగా జిల్లా కలెక్టర్ నెడ్ కాప్ సహకారంతో అవేరా సంస్థ నుండి విద్యుత్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేశారు. ఇకపై వ్యక్తి గత అవసరాలకు కారు వాడకాన్ని నిలిపి వేసి విద్యుత్ వాహనాన్ని ఉపయోగించాలని సిబ్బందిని ఆదేశించారు. తాను కూడా ఉదయం, సాయంత్రం వ్యక్తిగతంగా బయటకు వెళితే విద్యుత్ ద్విచక్ర వాహనం ఉపయోగించనున్నట్టు తెలిపారు. కలెక్టర్ ను ఆదర్శంగా తీసుకుని జిల్లా అధికారులు ఉద్యోగులు సాధ్యమైనంత వరకు ద్విచక్ర వాహనాలను వినియోగిస్తే నగరంలో కాలుష్యాన్ని కొంతమేరకు నివారించ డమేకాకుండా ప్రజలను కాలుష్య నివారణపై అవగాహన కల్పించేందుకు దోహదపడుతుందన్నారు.
Admin