Sunday, 08 September 2024 07:53:20 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

IND vs NZ : 219 రన్స్ కి టీమిండియా ఆలౌట్

Date : 30 November 2022 11:55 AM Views : 232

జై భీమ్ టీవీ - క్రీడలు / : క్రైస్ట్ చర్చ్: మూడో వన్డేలో 47.3 ఓవర్లలో 219 పరుగులకు భారత్ ఆలౌట్.. న్యూజిలాండ్ విజయలక్ష్యం 220 పరుగులు.. వాషింగ్టన్ సుందర్ 51, శ్రేయాస్ అయ్యర్ 49.. డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నేలకు తలో మూడు వికెట్లు న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఈ మ్యాచ్ లో భారత కుర్రాళ్లు బ్యాటింగ్ లో న్యూజిలాండ్ కి గట్టిపోటీ ఇవ్వలేకపోయారు. మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్ (49), లోవర్ ఆర్డర్ లో ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ (51) మినహా ఏ బ్యాటర్ కూడా న్యూజిలాండ్ బౌలర్లకు ఎదురు నిల్వలేకపోయారు. దూకుడుగా ఆడి స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాలనుకున్న ఓపెనింగ్ జోడీ శిఖర్ ధవన్ (28), శుభ్ మన్ గిల్ (13) 17 ఓవర్లు ముగిసేసరికి పెవిలియన్ చేరారు. అ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ అయ్యర్ కు తోడుగా నిలిచి మంచి భాగస్వామ్యం నెలకొల్పుతారనుకున్న పంత్ (10), సూర్య కుమార్ యాదవ్ (6) మరొకసారి నిరాశపరిచారు. మిగతా బ్యాట్స్ మన్ దీపక్ చాహర్ (12), దీపక్ హుడా (12) కూడా బ్యాట్ తో రాణించలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్ డారిల్ మిచెల్ 7 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. తనకు తోడుగా టిమ్ సౌథీ 8.3 ఓవర్లలో 36 రన్స్ ఇచ్చి 2 వికెట్లు, ఆడమ్ మిల్నే 3 వికెట్లు పడగొట్టారు. లాకీ ఫెర్గూసన్, మిచెల్‌ సాంట్నర్ చెరో వికెట్‌ తీశారు. కాగా ఇప్పటికే ఈ సిరీస్ లో కివీస్ 1 0 తో ముందంజలో ఉంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :