Sunday, 08 September 2024 08:03:17 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

సముద్రుడు రాసిన రక్త చరిత్ర.. దివిసీమ ఉప్పెనకు 46 ఏళ్లు.. నేటికీ స్థానికులకు ఈ రోజు కాళరాత్రే..

Date : 19 November 2023 08:52 AM Views : 153

జై భీమ్ టీవీ - క్రీడలు / : మానవుడికి జీవితాన్ని ఇచ్చే ప్రకృతికి కోపం వస్తే.. భారీ వర్షాలు, వరదలు, ఉప్పెనలు, సునామీలు, భూకంపాలు వంటి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. మానవ జీవితాలను భయబ్రాంతులకు గురించి చేస్తుంది. అలాంటి సంఘటనలు ఎన్ని ఏళ్లు అయినా చరిత్రలో అత్యంత విషాదకర ఘటనలుగా నిలిచిపోతాయి. అలాంటిదే దివిసీమ ఉప్పెన. ఈ ఘటన గుర్తుకొస్తే చాలు.. ఎవరికైనా కనురెప్పల మాటున దాగిన కన్నీళ్ల ఉప్పెన కట్టలు తెంచుకుంటుంది. వేలాదిమంది ప్రాణాలు బలిగొన్న ఆ మహా విషాదం జరిగి నేటితో 46 ఏళ్లు పూర్తి అయ్యాయి. అది కాళరాత్రి. సముద్రం మృత్యువులా మారి కాటేస్తే.. ఉప్పెన రూపంలో ముంచుకొస్తే.. ఎలా ఉంటుందో ఆనాటి రాత్రి కళ్లారా చూశారు దివిసీమ వాసులు. తెల్లారి లేచి చూసిన తర్వాత మనిషి కనిపిస్తే బతికి ఉన్నట్లు.. లేకుంటే చనిపోయినట్లు అని ప్రజలు అనుకున్నారంటే అదెంత మహా విషాదమో అర్థమవుతుంది. చరిత్ర పుటలను తిప్పితే.. దివిసీమ ఉప్పెన రాసిన రక్త చరిత్ర నవంబర్‌ 19, 1977 నాడు ప్రత్యక్షమవుతుంది. చరిత్రలో అది కేవలం ఓ తేదీ మాత్రమే కాదు.. దివిసీమపై ప్రకృతి చేసిన మృత్యు సంతకానికి చిహ్నం ఆ రోజు. సముద్రం జల ఖడ్గం దూసి రాకాసి అలల రూపంలో విరుచుకు పడితే ఊళ్లకు ఊళ్లే మాయమైపోయాయి. వేలాదిమంది ప్రాణాలు బలిగొన్న దివిసీమ ఉప్పెన విషాదం.. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాదు.. భారత దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విషాదం అని చెబుతారు. వేలాదిమందికి నూరేళ్లు నిండేలా చేసిన ఆ మహా విషాదానికి నేటితో 46 ఏళ్లు నిండాయి. ఆనాడు పెను తుఫాను విరుచుకుపడితే, సముద్రం ఉప్పొంగి ఊళ్ల మీద పడితే, తాటి చెట్టు ఎత్తులో రాకాసి అలలతో ముంచేస్తే.. 10వేలమందికి పైగా మృత్యువాత పడ్డారు. అనధికారికంగా చనిపోయిన వాళ్ల సంఖ్య 30 వేలకు పైమాటే. ఇక మూగ జీవాలు లక్షల సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. ఆనాడు అండ‌మాన్ స‌మీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌.. క్రమేపీ బ‌ల‌ప‌డుతూ.. భ‌యంక‌ర ఉప్పెన‌గా మారింది. ఆ ముందు రోజు రాత్రి స‌ముద్రుడు ఎంతో ప్రశాంతంగా క‌న‌బడడంతో .. ఎవ్వరికీ అనుమానం రాలేదు.. అది భారీ విధ్వంసాన్ని సృష్టించే పెను తుఫానుకి ముందు ప్రశాంత‌త అని.. ఈ ఉప్పెన దాడికి తీర ప్రాంత గ్రామాలైన సొర్ల‌గొంది, మూల‌పాలెం, దిండి, సంగ‌మేశ్వరం, నాలి లాంటి గ్రామాలు నామ‌రూపాల్లేకుండా పోయాయి. ఉప్పెన విధ్వంసానికి కొట్టుకు వ‌చ్చిన శ‌వాలు గుట్టలు గుట్టలుగా క‌న‌బ‌డేవ‌ట‌. దాదాపు కొన్నినెల‌ల పాటు మృతదేహాలు ఏదో ఒక మూల దొరుకుతూనే ఉండేవంటే అల‌నాటి విధ్వంసం ఎంత భ‌యాన‌క‌మో అర్ధం చేసుకోవాల్సిందే.. దివిసీమ ప్రారంభంలో త‌మ ప్రాంతంపై దాడి చేసిన రాకాసి అల‌ల ఎత్తుకి ప్రతిబింబంగా ఓ స్థూపం క‌ట్టించారు. సొర్ల‌గొంది గ్రామంలో శ‌వాల‌ను తొల‌గిస్తున్న పోలీసుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఏటా న‌వంబ‌ర్ 19… ఆయా గ్రామాల ప్రజలకు నిద్ర లేని రాత్రినే మిగులుస్తుంది. ఎన్ని ఏళ్లు గడిచినా స్థానికుల మదిలో స‌ముద్రుడు ఎక్కడ దాడి చేస్తాడోన‌న్న భ‌యం కలుగుతూనే ఉంది. జనం రాత్రంతా జాగారం చేస్తారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :