Sunday, 08 September 2024 07:45:40 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్.. రన్నరప్‌గా శ్రీహాన్

Date : 19 December 2022 01:31 AM Views : 228

జై భీమ్ టీవీ - సినిమా / : బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ – 6 గ్రాండ్ ఫినాలే ఫలితం వెలువడింది. సింగర్ రేవంత్ ను విజేతగా హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఈసందర్భంగా రేవంత్ భావోద్వేగానికి గురయ్యాడు. హౌస్ మేట్స్, ఆడియన్స్ సహా అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. తాను గెల్చుకున్న ట్రోఫీని తన కూతురికి అంకితమిచ్చాడు. దీంతో రేవంత్ కు రూ.10 లక్షల క్యాష్ ప్రైజ్, రూ.25 లక్షలు విలువైన ప్లాట్, కొత్త కారును బహుమతిగా అందించారు. ఇక అంతకుముందు హౌస్ లోకి వెళ్లిన కింగ్ నాగార్జున తన గోల్డెన్ బాక్స్ లో రూ.40 లక్షలు తీసుకెళ్లాడు. వాటిని రేవంత్, శ్రీహాన్ లలో ఎవరైనా ఒకరు తీసుకొని బయటకు వెళ్లొచ్చని ఆఫర్ ఇచ్చారు. అయితే శ్రీహాన్ ఈ ఆఫర్ కు అంగీకారం తెలపడంతో రేవంత్ విన్నర్ గా నిలిచాడు. ప్రైజ్ మనీ రూ.50 లక్షల్లో రేవంత్ కు రూ.10 లక్షలు దక్కుతాయి. అయితే ఓటింగ్ ప్రకారం.. రేవంత్ కంటే శ్రీహాన్ టాప్ వన్ లో ఉన్నాడని నాగార్జున అనౌన్స్ చేశారు. అంతకుముందు నాగార్జున ఫినాలే రౌండ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తమ డ్యాన్స్ లతో అదరగొట్టారు. అర్జున్ కళ్యాణ్, వాసంతి, సూర్య, ఫైమా, రాజ్, సుదీప, మరీనా, అభినయ, గీతూ రాయల్, ఆరోహి స్టెప్పులేసి అలరించారు. ఇక ఇవాళ బిగ్ బాస్ హౌస్ నుంచి రోహిత్, ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత రవితేజ హౌస్ లోకి వెళ్లి హల్ చల్ చేశారు. అనంతరం కీర్తిని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :