Sunday, 08 September 2024 07:42:27 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

‘తూచ్‌.. అంతా ఒట్టిదే’.. చైతూతో మళ్లీ కలుస్తుందంటూ వార్తలు.. ఆ పని చేసి షాక్ ఇచ్చిన సామ్

Date : 12 October 2023 02:42 PM Views : 86

జై భీమ్ టీవీ - సినిమా / : టాలీవుడ్‌లో ది మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకుని అందరికీ షాక్‌ ఇచ్చారు. వీరు విడిపోయి సుమారు రెండేళ్లు అవుతోంది. సుమారు పదేళ్ల పాటు ప్రేమించి పెళ్లి పీటలెక్కిన ఈ దంపతులు వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. అయితే ఈ క్యూట్‌ పెయిర్‌ విడిపోవడాన్ని ఇప్పటికీ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. వారిద్దరూ మళ్లీ కలిస్తే బాగుందనుకునే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఈ మధ్యన చైతన్య, సామ్ మళ్లీ కలుస్తున్నారంటూ మళ్లీ రూమర్స్‌ మొదలయ్యాయి. ఎందుకంటే సమంత వద్ద ఉంటే పెట్‌ డాగ్‌ హష్‌ నాగచైతన్య వద్ద కనిపించింది. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యాయి. దీంతో ఈ లవ్లీ జోడీ మళ్లీ కలుస్తుందనే ప్రచారం ఊపందుకుంది. అటు చైతూ అభిమానులు, సమంత ఫ్యాన్స్‌ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే ఈ ఆనందంపై సమంత నీళ్లు చల్లింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది సామ్‌. తన ప్రొఫెషనల్‌ అండ్‌ పర్సనల్‌ విషయాలను అందులో షేర్‌ చేస్తోంది. అలాగే గ్లామరస్‌ ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలా పింక్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను ఇన్‌ స్టా గ్రామ్‌ లో షేర్‌ చేసింది సామ్‌. వీటిని చూసిన ఫ్యాన్స్‌ ఒక్కసారిగా షాక్‌ అవుతున్నారు. గతంలో సామ్‌ షేర్‌ చేసిన ఫొటోల్లో ఆమె శరీరంపై అక్కినేని నాగచైతన్య పచ్చ చొట్టు ఉండేది. విడాకులు తీసుకున్నప్పటి నుంచి మొన్నటి వరకు ఈ ట్యూటూ కనిపించేది. చైతన్యపై ఉన్న ప్రేమకు గుర్తుగానే సామ్ ఈ ట్యాటూను అలాగే ఉంచుకుందంటూ ఫ్యాన్స్ తెగ ఖుషీ అయ్యేవారు. అయితే తాజాగా షేర్‌ చేసిన ఫొటోల్లో చైతన్య ట్యూటూ కనిపించలేదు. దీంతో నెటిజనుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కలుస్తారనుకుంటున్న తరుణంలో ఈ షాకింగ్‌ ట్విస్ట్‌ ఏంటి సామీ..అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరి సమంత నిజంగానే చైతన్య ట్యూటూ తొలగించుకుందా? లేక ఉద్దేశపూర్వకంగానే కనిపించుకుండా జాగ్రత్త పడిందా? అనేది తెలియాల్సి ఉంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :