Sunday, 08 September 2024 07:37:32 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

తప్పులన్నీ నువ్వు చేసి అందరిపై అరిస్తే ఎలా ?.. సందీప్ ఆట కట్టించిన నాగ్..

Date : 08 October 2023 08:55 AM Views : 99

జై భీమ్ టీవీ - సినిమా / : స్మైల్ టాస్క్ నుంచి కెప్టెన్సీ టాస్క్ రంగుపడుద్ది రాజా టాస్క్ వరకు ప్రతి దాంట్లో ఫౌల్ చేయడం.. ఆ తర్వాత మిగితా ఇంటి సభ్యుల మీదికే తిరగబడుతూ తమ తప్పును సమర్దించుకోవడం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో గొంతు పెంచుతూ అరుస్తూ నానా హంగామా సృష్టించారు వీరిద్దరు. ఇక ఈవారం వీరిద్దరి చేసిన తప్పులను వీడియోలతో సహా బయటపెట్టారు నాగ్. దీంతో సందీప్, అమర్ దీప్ బిక్కమొహం వేశారు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అల్లాడించేశారు నాగ్. Bigg Boss 7 Telugu: తప్పులన్నీ నువ్వు చేసి అందరిపై అరిస్తే ఎలా ?.. సందీప్ ఆట కట్టించిన నాగ్.. ఐదో వారం హౌస్‏లో జరిగిన టాస్కులు.. అందులో కంటెస్టెంట్స్ చేసిన తప్పోప్పులను నిలదీశారు నాగ్. ముఖ్యంగా ఈ వారం అమర్ దీప్, సందీప్ లను నిల్చోబెట్టి పాయింట్ టూ పాయింట్ మాట్లాడుతూ చుక్కలు చూపించారు. ఈవారం మొత్తం ఆటలో వీరిద్దరి చేసినన్నీ తప్పులు ఇంకెవరూ చేయలేదంటూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. స్మైల్ టాస్క్ నుంచి కెప్టెన్సీ టాస్క్ రంగుపడుద్ది రాజా టాస్క్ వరకు ప్రతి దాంట్లో ఫౌల్ చేయడం.. ఆ తర్వాత మిగితా ఇంటి సభ్యుల మీదికే తిరగబడుతూ తమ తప్పును సమర్దించుకోవడం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో గొంతు పెంచుతూ అరుస్తూ నానా హంగామా సృష్టించారు వీరిద్దరు. ఇక ఈవారం వీరిద్దరి చేసిన తప్పులను వీడియోలతో సహా బయటపెట్టారు నాగ్. దీంతో సందీప్, అమర్ దీప్ బిక్కమొహం వేశారు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అల్లాడించేశారు నాగ్. ముందుగా నాగ్ మాట్లాడుతూ.. స్మయిల్ బోర్డ్ ఛాలెంజ్ గురించి మాట్లాడుతూ.. టాస్క్ కంప్లీట్ కాకుండానే బెల్ కొట్టేశావ్ అది తప్పే కదా అని నాగ్ అడగ్గా.. దానికి కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు నాగ్. అయితే సందీప్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పాయింట్ టూ పాయింట్ మాట్లాడారు నాగ్. అప్పుడు చికెన్ టాస్క్ లో ప్రశాంత్ పూర్తి చేయకుండానే బెల్ కొట్టాడని అతడిని ఆట నుంచి తప్పించావ్. ఇప్పుడు నువ్వు చేసిందేంటీ ?.. మనం చేస్తే తప్పు కాదు.. మిగతావాళ్లు చేస్తే తప్పు.. మన తప్పులు మనకు కనబడవా అంటూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. నువ్వు బెల్ కొట్టి మిగతావాళ్ల ఫౌల్స్ గురించి మాట్లాడావ్.. ఇదెక్కడి న్యాయం సందీప్ అంటూ కౌంటరిచ్చాడు. ఆ త్రవాత ఫ్రూట్ నింజా టాస్కులో చేసిన ఫౌల్ గురించి మాట్లాడుతూ.. వీడియో చూపించి మరీ ఉతికారేశారు. తప్పే కానీ గేమ్ లో భాగమే అంటూ సమర్ధించుకోబోయాడు. ఆ తర్వాత లెటర్ త్యాగం చేస్తే అమర్ కంటెస్టెండర్ అయ్యేవాడు కానీ నీ గురించి మాత్రమే ఆలోచించుకున్నావ్ అని నాగ్ అనగా.. అమర్ దీప్ ను సేవ్ చేయాలనుకున్నానంటూ తెలివిగా ప్రశ్న దాటవేసే ప్రయత్ం చేశాడు. ఇదే విషయంపై మరోసారి ప్రశ్నించగా.. నా హౌస్మేట్ తనకు ఇచ్చేయండి అంటూ డైలాగ్ వేశాడు. గెలవడం ఎంత ముఖ్యమో ఆ గెలుపు కోసం మనం ఎలా ప్రయత్నిస్తున్నామన్నది కూడా అంతే ముఖ్యం. ఇది గుర్తుపెట్టుకో అన్నారు నాగ్.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :