Sunday, 08 September 2024 07:45:40 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

Date : 23 December 2022 08:34 AM Views : 222

జై భీమ్ టీవీ - సినిమా / హైదరబాద్ : టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం 4 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణ దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. కైకాల సత్య నారాయణ మరణ వార్త తెలిసి టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. కైకాల సత్యనారాయణ తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. 87ఏళ్ల సత్యనారాయణ 60 ఏళ్ల సినీజీవితాన్ని అనుభవించారు. కైకాల సత్యనారాయణ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, క‌మెడియ‌న్ ఇలా అన్నీ ర‌కాల ప్రాత‌ల‌ను పోషించి త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు స‌త్యనారాయ‌ణ‌. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు. కైకాల సత్యనారాయణ 1935 జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జన్మించారు. విజయవాడ, గుడివాడలో విద్యాభ్యాసం చేశారు. కైకాల సత్యనారాయణ నవరస నటసార్వభౌమగా పేరుగాంచారు. 1960లో కైకాల నాగేశ్వరమ్మల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు,ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 1959లో సిపాయి కూతురు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ముఖ్యంగా యుముడి పాత్రతో ఆయన ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. రేపు మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు జరగనున్నాయి

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :