Sunday, 08 September 2024 07:28:49 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

‘టైగర్ నాగేశ్వర రావు’ ట్విట్టర్ రివ్యూ.. రవితేజ మూవీపై అడియన్స్ రియాక్షన్..

Date : 20 October 2023 09:08 AM Views : 105

జై భీమ్ టీవీ - సినిమా / : మాస్ మహారాజా రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర రావు. డైరెక్టర్ వంశీ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించగా.. ఇందులో గుర్రం జాషూవా కుమార్తె హేమలత లవణం పాత్రలో సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ నటించారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈరోజు (అక్టోబర్ 20)న గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలాచోట్ల ప్రీమియర్స్ షోస్ చూసిన అడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టైగర్ నాగేశ్వర రావు అదిరిపోయిందంటూ రివ్యూస్ ఇస్తున్నారు. ఫస్ట్ హాఫ్ సూపర్ అని.. ముఖ్యంగా రవితేజ మాస్ ఎంట్రీ మాత్రం అదిరిపోయిందని.. ఇక స్క్రీన్ ప్రజెన్స్ మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో టైగర్ నాగేశ్వర రావు సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలోని ప్రతి ఫైట్ సీన్ మాత్రం సూపర్ అని.. ఇక జీవి ప్రకాష్ అందించిన బీజీఎం వేరేలెవల్. ఈ సినిమా రవితేజ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు. టైగర్ నాగేశ్వర రావు సినిమా గురించి అంటే.. హీరో ఇంట్రడక్షన్.. యాక్షన్ సీన్స్ గురించి ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ట్రైన్ సీక్వెన్ బాగుందని.. మాస్ మాహారాజా అభిమానులకు గూస్ బంప్స్ అంటున్నారు. ఇక రవితేజ.. రేణు దేశాయ్ పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగుందని అంటున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :