Sunday, 08 September 2024 07:39:30 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

టామీ హిల్ఫిగర్ బ్రాండ్ అంబాసిడర్గా సమంత

Date : 08 April 2023 02:03 AM Views : 149

జై భీమ్ టీవీ - సినిమా / : టామీ హిల్ ఫిగర్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ని ప్రకటించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. ఇకనుంచి టామీ హిల్ ఫిగర్ సంస్థకు చెందిన మహిళల వాచ్ ప్రకటనల్లో సామ్ కనిపించనున్నారు. స్ప్రింగ్ సమ్మర్ 23 క్యాంపెయిన్లో భాగంగా.. ఏప్రిల్ నెలలో టామీ హిల్ ఫిగర్ విడుదల చేసే ప్రకటనల్లో సమంత కనిపిస్తారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ ప్రకటనల్లో ఇప్పటివరకు పలువురు పాప్ ఐకాన్స్ కు మాత్రమే నటించే అవకాశం వచ్చింది. అయితే, తొలిసారి ఇందులో సమంతకు నటించే అవకాశం రావడం విశేషం. టామీ రాబోతోన్న విమెన్ కలెక్షన్ వాచ్ ల్లో ఈసారి వెరైటీస్ కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. టామీ నుంచి వస్తున్న విమెన్స్ వాచ్ ల్లో స్టీల్, గోల్డ్ ప్లేట్, లెదర్ స్టైల్స్ లో రాబోతున్నాయి. అన్ని వేడుకులకు ధరించేలా వీటిని డిజైన్ చేశారు. వాచ్ గానే కాకుండా చేతికి వేసుకునే బ్రేస్ లైట్లా కూడా ఈ కొత్త ఉత్పత్తులను టామీ కంపెనీ రూపొందించింది. తనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై సమంత స్పందించారు. టామీ ఫ్యామిలీలో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. టామీ సంస్థ ఒక గ్లోబల్ బ్రాండ్ అని.. ప్రతి వ్యక్తికి తమ వ్యక్తిగత స్టైల్, డిజైన్ ఉండేలా ఈ కంపెనీ ఉత్పత్తులను అందిస్తుందని సమంత అన్నారు. టామీ నుంచి వస్తున్న స్ప్రింగ్ సమ్మర్ వాచ్లు తనకు ఎంతో నచ్చాయని.. వీటిని అందరికీ పరిచయం చేసేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సమంత పేర్కొన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :