Sunday, 08 September 2024 07:36:09 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్.. నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే..

Date : 17 October 2023 06:44 PM Views : 109

జై భీమ్ టీవీ - సినిమా / : 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023 ప్రధానోత్సవ వేడుకలు న్యూఢిల్లీలో అట్టహాసంగా జరుగుతున్నాయి. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రదానం చేశారు. ఈవేడుకలలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, ఎంఎం కీరవాణి, దేవీ శ్రీ ప్రసాద్, చంద్రబోస్, కృతి సనన్, అలియా భట్ జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. పుష్ప చిత్రంలోని తన నటనక గానూ ఉత్తమ జాతీయ నటుడిగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు బన్నీ. ఈ స్పెషల్ మూమెంట్స్‏ను ఆయన సతీమణి స్నేహ రెడ్డి తన ఫోన్ లో బంధించారు. జాతీయ చలనచిత్ర అవార్డుల చరిత్రలో ఈ అవార్డును అందుకున్న తొలి తెలుగు స్టార్‌గా బన్నీ హిస్టరీ క్రియేట్ చేశారు. అలాగే “రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్”తో దర్శకుడిగా మారిన ఆర్ మాధవన్ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకోగా, ఉత్తమ నటిగా గంగూబాయి కతియవాడి చిత్రానికి అలియా భట్ అవార్డ్ అందుకున్నారు. అలాగే నేషనల్ అవార్డ్స్ అందుకున్న విజేతల జాబితాపై ఓ లుక్కేయ్యండి. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల పూర్తి జాబితా: ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్. ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్, గోదావరి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: RRR నేషనల్ ఇంటిగ్రేషన్: ది కాశ్మీర్ ఫైల్స్‌పై ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నర్గీస్ దత్ అవార్డు ఉత్తమ నటుడు: అల్లు అర్జున్, పుష్ప ఉత్తమ నటి: అలియా భట్, (గంగూబాయి కతియావాడి), కృతి సనన్ (మిమీ) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమీ) ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి, (ది కాశ్మీర్ ఫైల్స్) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రాబారి (ఛెలో షో) ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్): షాహి కబీర్ (నాయట్టు) ఉత్తమ స్క్రీన్ ప్లే (అడాప్టెడ్): సంజయ్ లీలా భన్సాలీ & ఉత్కర్షిణి వశిష్ఠ (గంగూబాయి కతియావాడి) ఉత్తమ సంభాషణ రచయిత: ఉత్కర్షిణి వశిష్ఠ & ప్రకాష్ కపాడియా (గంగూబాయి కతియావాడి) ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప) ఉత్తమ సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం): MM కీరవాణి (RRR) ఉత్తమ నేపథ్య గాయకుడు: కాల భైరవ (RRR) ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిజల్) ఉత్తమ సాహిత్యం: చంద్రబోస్ (కొండ పొలం) ఉత్తమ హిందీ చిత్రం: సర్దార్ ఉదమ్ ఉత్తమ కన్నడ చిత్రం: 777 చార్లీ ఉత్తమ మలయాళ చిత్రం: హోమ్ ఉత్తమ గుజరాతీ చిత్రం: ఛెలో షో ఉత్తమ తమిళ చిత్రం: కడైసి వివాహాయి ఉత్తమ తెలుగు చిత్రం: ఉప్పెన ఉత్తమ మైథిలి చిత్రం: సమనంతర్ ఉత్తమ మిస్సింగ్ చిత్రం: బూంబా రైడ్ ఉత్తమ మరాఠీ చిత్రం: ఏక్దా కాయ్ జలా ఉత్తమ బెంగాలీ చిత్రం: కల్‌కోఖో ఉత్తమ అస్సామీ చిత్రం: అనూర్ ఉత్తమ మెయిటీలోన్ చిత్రం: ఐఖోయిగి యమ్ ఉత్తమ ఒడియా చిత్రం: ప్రతీక్ష ఉత్తమ తొలి దర్శకుడిగా ఇందిరా గాంధీ అవార్డు: మెప్పడియాన్, విష్ణు మోహన్ సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం: అనునాద్ – ది రెసొనెన్స్ పర్యావరణ పరిరక్షణ/పరిరక్షణపై ఉత్తమ చిత్రం: ఆవాసవ్యూహం ఉత్తమ బాలల చిత్రం: గాంధీ అండ్ కో ఉత్తమ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ & సోను కెపి, చవిట్టు ‘ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్): అనీష్ బసు, జిల్లీ ఉత్తమ ఆడియోగ్రఫీ (ఫైనల్ మిక్స్‌డ్ ట్రాక్‌కి రీ-రికార్డిస్ట్): సినోయ్ జోసెఫ్, సర్దార్ ఉదమ్ ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, RRR ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ, సర్దార్ ఉదమ్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీర కపూర్ ఈ, సర్దార్ ఉదం ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్, RRR ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: డిమిత్రి మలిచ్ మరియు మాన్సీ ధ్రువ్ మెహతా, సర్దార్ ఉదమ్ ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి) బెస్ట్ మేకప్: ప్రీతీషీల్ సింగ్ (గంగూబాయి కతియావాడి) ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ: కింగ్ సోలోమన్, RRR స్పెషల్ జ్యూరీ అవార్డు: షేర్షా, విష్ణువర్ధన్

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :