Sunday, 08 September 2024 07:39:30 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఓటీటీలోకి రాబోతున్న ‘స్కంద’.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడు రానుందంటే..

Date : 12 October 2023 08:58 AM Views : 105

జై భీమ్ టీవీ - సినిమా / : చాలా కాలం బ్రేక్ తర్వాత ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటేస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. తొలిసారిగా రామ్ సరసన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటించింది. ట్రైలర్, టీజర్, పాటలతోనే విడుదలకు ముందే భారీ హైప్ సంపాదించుకున్న ఈ సినిమా గత నెలలో అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే మొదటి రోజు పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈసినిమా ఆ తర్వాత వరుసగా రెండు మూడు రోజులు మంచి కలెక్షన్స్ రాబట్టాయి. కానీ ఆ తర్వాత మెల్లగా కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఈ మూవీలో ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా రామ్ నటనకు మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ సైతం ఫిక్స్ అయిందని ఫిల్మ్ వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయిన నెలలోపే అంటే అక్టోబర్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. కానీ త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది. చూడాలి మరీ.. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎంత మేర మెప్పిస్తుందో.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :