Sunday, 08 September 2024 07:39:43 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ప్రేక్షకులను అలరిస్తోన్న ప్రేమ విమానం.. సినిమా ఎలావుందంటే

Date : 13 October 2023 01:06 PM Views : 93

జై భీమ్ టీవీ - సినిమా / : మూవీ రివ్యూ: ప్రేమ విమానం నటీనటులు: సంగీత్ శోభన్, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, శాన్వీ మేఘన, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా తదితరులు సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ సినిమాటోగ్రఫీ: జగదీశ్‌ చీకటి నిర్మాత: అభిషేక్ నామా దర్శకత్వం: సంతోష్ కట్టా ఈ రోజుల్లో థియేటర్ కోసం కొన్ని సినిమాలు.. ఓటిటి కోసం మరికొన్ని సినిమాలు తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. అలా వచ్చిన సినిమా ప్రేమ విమానం. మ్యాడ్ సినిమాలో సెన్సేషనల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న సంగీత్ శోభన్ ఇందులో కీలక పాత్ర చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేమ విమానం ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. కథ: రాము (దేవాన్ష్‌ నామా), లక్ష్మణ్‌ (అనిరుధ్‌ నామా) లకు విమానం ఎక్కాలనేది కోరిక. చిన్నపిల్లలు కాబట్టి వాళ్లకు విమానం చూస్తే ఎగరిగంతేస్తూ ఉంటారు. విమానం ఎక్కాలన్న తమ కోరికను తండ్రి (రవివర్మ) కి చెప్తే పంట డబ్బులు వచ్చాక ఎక్కిస్తా అని మాటిస్తాడు. కానీ అప్పుల బాధతో ఉరేసుకొని మరణిస్తాడు. తల్లి శాంతమ్మ(అనసూయ భరద్వాజ్‌) కూలి పనికెళ్తూ పిల్లలను పోషించుకుంటుంది. వాళ్లు మాత్రం విమానం ఎక్కాలనే కోరికతో తల్లికి తెలియకుండా రకరకాలు పనులు చేస్తుంటారు. మరోవైపు మణికంఠ అలియాస్‌ మణి(సంగీత్‌ శోభన్‌) ఆ ఊరి సర్పంచ్‌ కూతురు అభిత (శాన్వీ మేఘన) ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు. ఆమె కూడా మణిని ఇష్టపడుతుంది. అదే సమయంలో అభితకు అమెరికా సంబంధం రావడంతో తండ్రి ఆ పనుల్లో బిజీగా ఉంటాడు. పెళ్లి ఇష్టం లేని అభిత.. తను ప్రేమించిన మణితో వెళ్ళిపోతుంది. ఊరి నుంచి హైదరాబాద్‌ వస్తారు. మరోవైపు విమానం ఎక్కాలనే పిచ్చితో ఇంట్లో తల్లి దాచిన డబ్బును దొంగిలించి రాము, లక్ష్మణ్‌ హైదరాబాద్‌కు వస్తారు. ఎయిర్‌పోర్ట్‌ కోసం వెతుకుతుంటారు. వాళ్లకు ఎదురైన సమస్యలు ఏంటి..? రాము, లక్ష్మణ్‌లు.. మణి, అభితలకు ఎలా కలిశారు? విమానం ఎక్కాలనే వారి కోరిక నెరవేరిందా లేదా? అనేది అసలు కథ.. కథనం: టైటిల్‌ లోనే సినిమా కథ చెప్పాడు దర్శకుడు. ఒకవైపు ప్రేమ జంట.. ఇంకోవైపు విమానం ఎక్కాలని కలలుగానే ఇద్దరు పిల్లలు.. ఈ ఇద్దరి ప్రయాణమే ప్రేమ విమానం. వాళ్ళిద్దరూ ఎక్కడ కలిశారు.. ఎలా కలిశారు అనేది స్క్రీన్ ప్లే. రెండు డిఫరెంట్‌ కథలను చెబుతూ ఇదివరకు వేదం లాంటి సినిమాలు వచ్చాయి. ఇందులో కూడా ఇదే ఫార్మేట్ అప్లై చేశాడు దర్శకుడు సంతోష్ కట్ట. కాకపోతే అందులో కొంత వరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు. క్లైమాక్స్‌లో ఈ రెండు కథలను ముడిపెడుతూ అల్లుకున్న సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ప్రేమ కథ ఒకే గాని పిల్లల కథ నడుస్తున్నప్పుడు మాత్రం ఈ మధ్య వచ్చిన విమానం సినిమా గుర్తుకొస్తుంది. అందులో కూడా ఒక చిన్న పిల్లాడు చిన్నప్పటి నుంచి విమానం ఎక్కాలి అని ఆశపడుతూ ఉంటాడు.. ఇందులో కూడా అదే సన్నివేశాలు ఉండడంతో పెద్దగా కొత్తదనం అనిపించదు. విమానం ఎక్కాలనే చిన్న పిల్లల కోరికను చెపుతూ కథ మొదలుపెట్టిన కూడా తండ్రి మరణంతో కథ ఎమోషనల్‌ టర్న్‌ తీసుకుంటుంది. అక్కడి నుంచి కన్నీళ్లు పెట్టించే సన్నివేశాలు కూడా రాసుకున్నాడు దర్శకుడు సంతోష్. అదే సమయంలో విమానం ఎక్కేందుకు పిల్లలు చేసే పనులు.. స్కూల్‌ టీచర్‌ గోపాల్‌ (వెన్నెల కిశోర్‌)తో వచ్చే సన్నివేశాలు నవ్వు పుట్టిస్తాయి. ఇంకో వైపు మణి, అభిత ప్రేమకథ ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్‌ సింపుల్‌గా వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ ఓకే. సెకండాఫ్‌ ఆసక్తికరంగా మొదలు పెట్టిన దర్శకుడు మధ్యలో కాసేపు వదిలేసాడు. చివర్లో మళ్లీ ట్విస్ట్‌ బాగుంటుంది. కానీ హడావిడిగా ముగించిన ఫీలింగ్ వస్తుంది. ఇందులో ఇంకా ఎమోషన్ పండించే సన్నివేశాలు చాలానే రాసుకోవచ్చు.. కానీ ఆ దిశగా దర్శకుడు పెద్దగా ఆలోచించలేదేమో అనిపిస్తుంది. వాటిని లైట్‌గా చూపించి వదిలేశాడు. నటీనటులు: అనసూయ భరద్వాజ్ ఈమధ్య నటిగా తనను తాను నిరూపించుకునే పనిలో పడింది. విమానం సినిమాలో అద్భుతమైన నటించిన ఈమె ప్రేమ విమానం సినిమాలో కూడా చాలా బాగా నటించింది. శాంతమ్మగా తన పాత్రకు 100% న్యాయం చేసింది అనసూయ. కీలకమైన రాము, లచ్చి పాత్రల్లో దేవాన్ష్‌ నామా, అనిరుధ్‌ నామా చాలా బాగా నటించారు. మొదటి సినిమా అయినా కూడా స్క్రీన్ మీద ఎలాంటి బెరుకు కనిపించలేదు. ఈ మధ్యే ‘మ్యాడ్‌’ చిత్రంతో అలరించిన సంగీత్‌ శోభన్‌.. ఇందులో ప్రేమికుడుగా నటించి మెప్పించాడు. మరోసారి ఎందులో కూడా ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సంగీత్‌కు జోడీగా నటించిన శాన్వీ మేఘన ఆకట్టుకుంది. మిగిలిన వాళ్లందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ టీం: అనూప్‌ రూబెన్స్‌ సంగీతం బాగుంది. చాలా రోజుల తర్వాత ఈయన నుంచి మంచి ఔట్ ఫుట్ వచ్చింది. పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ ఓకే. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు సంతోష్ కట్టా మాత్రం మంచి కథ రాసుకున్న దాన్ని మరింత ఎమోషనల్ గా చూపించడంలో విఫలమయ్యాడు. కొంతవరకు బాగానే మేనేజ్ చేసినా.. కీలకమైన సన్నివేశాలో మాత్రం అనుభవ రాహిత్యం కనిపించింది. ఓవరాల్ గా ఓటీటీ సినిమా కాబట్టి ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :