Sunday, 08 September 2024 07:32:29 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

జాతీయ అవార్డ్ అందుకున్న దేవీ శ్రీ ప్రసాద్.. ఫోన్‏లో వీడియో తీసిన అల్లు అర్జున్..

Date : 17 October 2023 06:42 PM Views : 95

జై భీమ్ టీవీ - సినిమా / : మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పుష్ప చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్ అందుకున్నారు. అయితే డీఎస్పీ అవార్డ్ అందుకోవడం చూసి అల్లు అర్జున్ ఎంతో సంతోషించారు. ఆ క్షణాలను తన ఫోన్‏లో రికార్డ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. నేషనల్ అవార్డ్స్ విజేతలను మెడల్, సర్టిఫికేట్‌తో సత్కరించారు. ఢిల్లీలో 67వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ 2023 ప్రధానోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పుష్ప చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్ అందుకున్నారు. అయితే డీఎస్పీ అవార్డ్ అందుకోవడం చూసి అల్లు అర్జున్ ఎంతో సంతోషించారు. ఆ క్షణాలను తన ఫోన్‏లో రికార్డ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. నేషనల్ అవార్డ్స్ విజేతలను మెడల్, సర్టిఫికేట్‌తో సత్కరించారు. పుష్ప సినిమాలోని సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం యావత్ వరల్డ్ వైడ్ గా ఉన్న మ్యూజిక్ లవర్స్‏ను కట్టిపడేసింది. ఈ సినిమాలోని ఊ అంటావా మావ.. సామి సామి పాటలకు విదేశీయులు కాలు కదిపిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. పుష్ప సినిమాలోని పుష్ప రాజ్ నటనకు గానూ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు అల్లు అర్జున్. ఈ వేడుకలలో బన్నీ పక్కన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూర్చొగా.. SS రాజమౌళి వెనుక కూర్చుని కనిపించారు. వేదికపైకి దేవీ శ్రీ ప్రసాద్ అవార్డ్ అందుకున్న సమయాన్ని రికార్డ్ చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ చిరునవ్వుతో కనిపించాడు. బన్నీ స్పెషల్ మూమెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అంతకుముందు అల్లు అర్జున్ రెడ్ కార్పెట్ మీద మాట్లాడుతూ. “నేను ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. కమర్షియల్ సినిమా కోసం దీనిని అందుకోవడం వ్యక్తిగతంగా నాకు డబుల్ అచీవ్‌మెంట్.” అంటూ చెప్పుకొచ్చారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :