Sunday, 08 September 2024 07:38:16 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

“అన్నొస్తున్నాడు అని చెప్పండి”.. సలార్ సినిమా పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Date : 16 October 2023 10:17 AM Views : 113

జై భీమ్ టీవీ - సినిమా / : నేచరుల్ స్టార్ నాని రీసెంట్ గా దసరా సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. నాని మొదటి సారి ఈ సినిమాలో మాస్ మసాలా పాత్రలో నటించి మెప్పించాడు. దసరా సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఫుల్ జోష్ లో ఉన్న నాని ఇప్పుడు మరోసారి బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హాయ్ నాన్న అనే డిఫరెంట్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది. అందమైన ప్రేమ కథతో పాటు ఈ సినిమాలో తండ్రి కూతురు మధ్య ఉండే బాండింగ్ కూడా చూపించనున్నారు . ఇక హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ సినిమా పై ఇంట్రెస్ట్ ను డబుల్ చేసింది. ఈ టీజర్ లో తండ్రి కూతురు బాండింగ్ గురించి చూపిస్తూనే .. మృణాల్ తో లవ్ ట్రాక్ కూడా చూపించారు. పెళ్ళై పాప ఉన్న హీరోని ఒక అమ్మాయి ప్రేమించడం.. ఆమెను హీరో మిస్ అండర్స్టాండ్ చేసుకోవడం. ఆతర్వాత హీరో రియలైజ్ అవ్వడం ఈ టీజర్ లో చూపించారు. ఇక ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఈ ప్రెస్ మీట్ లో నాని సలార్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ముందుగా హాయ్ నాన్న సినిమాను డిసెంబర్ 21 కానీ 22న రిలీజ్ చేద్దాం అనుకున్నాం కానీ ఒక కుటుంబంలో పెద్దన్న సినిమా వస్తున్నప్పుడు తమ్ముడు డేట్ మార్చుకోవాలి కదా.! అని అన్నారు. సలార్ డిసెంబర్ 22 రిలీజ్ కానుంది. దాంతో నాని తన సినిమాను డిసెంబర్ 7కు మార్చుకున్నారు. డిసెంబర్ మొత్తం లవ్ స్టోరీ, యాక్షన్ ఎంటర్టైనర్స్ తో నిండిపోవాలని అని నాని అన్నాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. థాంక్యూ నాని అన్న అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. డిసెంబర్ 7 నాని హాయ్ నాన్న రిలీజ్ కానుంది..

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :