Sunday, 08 September 2024 07:33:36 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

సైలెంట్‏గా వెంకటేశ్ కూతురి నిశ్చితార్థం.. చిరంజీవి, మహేష్ బాబు హాజరు.. ఫోటోస్ వైరల్..

Date : 26 October 2023 10:55 AM Views : 103

జై భీమ్ టీవీ - సినిమా / : టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కూతురు హయవాహిని నిశ్చితార్థం వేడుక బుధవారం ఘనంగా జరిగింది. వెంకటేశ్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో పెద్ద అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి జరిగింది. ఓవైపు బిజినెస్ వ్యవహరాలు చూసుకుంటూనే మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. ఇక ఇప్పుడు రెండో అమ్మాయికి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు వెంకీ. బుధవారం తన కూతురు నిశ్చితార్థ వేడుకను హైదరాబాద్‏లో చాలా సైలెంట్‏గా చేశారు. ఇరు కుటుంబసభ్యులు.. ఇండస్ట్రీకి చెందిన అతికొద్ది మంది ప్రముఖుల సమక్షంలో ఎంగెజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఫోటోస్ చూస్తుంటే.. వెంకీ కూతురి నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బబు హాజరయ్యి నూతన జంటను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. వెంకటేశ్ రెండో కూతురిని విజయవాడకు చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయి అని సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో హయవాహిని వివాహం జరిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి నుంచి వెంకీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఇక తన సినిమాలు తప్ప.. ఫ్యామిలీ విషయాలు బయటకు తెలియనివ్వకుండా జాగ్రత్తగా ఉంటారు. ఇక ఇప్పుడు తన కూతురి ఎంగజ్మెంట్ విషయం గురించి మీడియాకు తెలియకుండానే చూసుకున్నారు. అటు వెంకీ తనయులు కూడా సోషల్ మీడియాకు దూరంగానే ఉంటారు. ఇక వెంకీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సైంధవ్ సినిమా చేస్తున్నాడు. తన కెరీర్ లో 75వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలకపాత్రలలో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :