Sunday, 08 September 2024 07:29:48 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

పొలిటికల్ హీట్ పెంచుతోన్న బాలయ్య డైలాగ్.. హీరో జైలు నుంచి రావాలి అంటూ..

Date : 14 October 2023 01:26 PM Views : 117

జై భీమ్ టీవీ - సినిమా / : అచ్చతెలుగు కంటెంట్‌తో అలరిస్తున్న ఆహాలో సూపర్ హిట్ రియాలిటీ షో అన్‌స్టాపబుల్‌. అల్టిమేట్‌ గెస్ట్‌ల ఎనర్జీ, నందమూరి బాలకృష్ణ అల్లరితో ఆడియన్స్‌కు ఫుల్ హై ఇచ్చే ఈ షో మరో సీజన్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సారి షార్ట్ అండ్ స్వీట్‌గా ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను ఆడియన్స్‌ ముందుకు తీసుకువస్తోంది ఆహా. తాజాగా నయా లిమిటెడ్ ఎడిషన్‌ ఫస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్‌ చేసింది యూనిట్‌. తొలి ఎపిసోడ్‌లో బాలయ్య అప్‌ కమింగ్ మూవీ భగవంత్ కేసరి టీమ్ సందడి చేసింది. హీరోయిన్లు కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీలతో పాటు డైరెక్టర్‌ అనిల్ రావిపూడి, విలన్‌ అర్జున్ రామ్‌ పాల్‌ కూడా షోలో పాల్గొన్నారు. బాలయ్య మార్క్ సందడితో మరోసారి ఆహా అనిపించేలా ఉంది నయా సీజన్‌. ఈ ఎపిసోడ్‌ అక్టోబర్ 17న సాయత్రం ఆరు గంటల నుంచి స్ట్రీమ్ కానుంది. ఇక ప్రోమోలో పంచ్‌ డైలాగ్స్‌తో మరోసారి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చారు బాలయ్య. ముఖ్యంగా చివర్లో చెప్పిన ఓ డైలాగ్‌ పొలిటికల్ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. ‘సినిమా అయినా రియల్ లైఫ్‌ అయినా అంతా బాగున్నప్పుడు ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చేయడానికి బయలు దేరుతాడు. మళ్లీ సెట్ చేయడానికి హీరో జైలు నుంచి రావాలి’ అంటూ చెప్పిన డైలాగ్‌ హీట్ పెంచుతోంది. ఏపీలోని పరిస్థితిని ఉంద్దేశించే బాలయ్య కామెంట్స్ చేశారని కొందరు అంటున్నారు. మరో వైపు బాలయ్య పంచులు ఫిదా అయ్యారు దర్శకుడు అనిల్. మీ కామెడీ, పంచ్ లు చూసిన తర్వాత మీతో ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ తీయాలని ఉంది అని అన్నాడు అనిల్. బాలయ్య కూడా దానికి సరే అన్నట్టుగా నవ్వేశారు. అలాగే హీరోయిన్ కాజల్‌ను తన మాటలతో ఫిదా చేశారు బాలయ్య.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :