Sunday, 08 September 2024 07:48:33 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

వెండితెరపై కేంద్ర మంత్రి జీవిత చరిత్ర.. రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌.. హీరో ఎవరో తెలుసా?

Date : 14 October 2023 01:27 PM Views : 99

జై భీమ్ టీవీ - సినిమా / : భారతీయ సినిమా పరిశ్రంలో బయోపిక్‌ల ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది. నాటి మహాత్మా గాంధీ మొదలు నేటి శ్రీలంక ముత్తయ్య మురళీ ధరన్‌ వరకు.. వివిధ రంగాల్లో తమ ప్రత్యేకత చాటుకున్న ప్రముఖలు జీవిత కథలు వెండి తెరపై ఆవిష్కృతమయ్యాయి. ఇప్పుడు మరో ప్రముఖుడి బయోపిక్‌ కూడా రానుంది. ఆయనే హైవే మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా నితిన్‌ గడ్కరీ. అవును భారత రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ జీవిత చరిత్ర త్వరలోనే సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించనుంది. గడ్కరీ పేరుతో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్షయ్ దేశ్‌ముఖ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనురాగ్ రాజన్ భూసారి దర్శకత్వం వహించారు. ఆయనే కథ, స్క్రీన్‌ప్లే కూడా సమకూర్చారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా పోస్టర్‌, టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. అయితే నితిన్ గడ్కరీ పాత్రలో ఎవరు నటిస్తారనే మాత్రం వెల్లడించలేదు. దీంతో కేంద్ర మంత్రి పాత్రలో ఎవరో నటిస్తున్నారోని తెలుసుకునేందుకు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా ఈ నిరీక్షణకు తెర దించారు మేకర్స్‌. తాజాగా గడ్కరీ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రముఖ నటుడు రాహుల్‌ చోపాడే టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. దీంతో పాటు గడ్కరీ రిలీజ్‌ డేట్‌ను కూడా అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. అక్టోబర్‌ 27న గడ్కరీ సినిమా విడుదల కానుంది. ‘ఈ దేశాన్ని రోడ్ల ద్వారా గుర్తిస్తే, నేను నితిన్ జైరామ్ గడ్కరీని అని ఆనందంగా చెప్పగలను’ అని టీజర్‌లో చెప్పినట్లే నితిన గడ్కరీ రాజకీయ జీవితంలో పాటు వ్యక్తిగత జీవితాన్ని ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్తగా, న్యాయవాదిగా, అలాగే కీలకమైన క్యాబినెట్ మంత్రిగా నితిన్‌ గడ్కరీ జీవితంలో చోటు చేసుకున్న ప్రధాన అంశాలను ఈ బయోపిక్‌లో ప్రస్తావించనున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు అనురాగ్ రాజన్ భుసారి మాట్లాడుతూ.. ‘ సమకాలీన రాజకీయాల్లో నితిన్ గడ్కరీది అసాధారణ వ్యక్తిత్వం. గడ్కరీ సినిమా పోస్టర్ విడుదలయ్యాక నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. నితిన్ గడ్కరీ పాత్రలో ఎవరు నటిస్తారని చాలా మంది అడిగారు. ఒక సాధారణ కార్యకర్త, సామాజిక కార్యకర్త నుంచి కీలకమైన క్యాబినెట్ మంత్రి వరకు సాగిన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మందికి ఈ ఇతర ప్రపంచాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. నితిన్ గడ్కరీ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండేవారో, ఎలా ఉన్నారో ప్రేక్షకులు ‘గడ్కరీ’ చూసి తెలుసుకోవచ్చు’ అని చెప్పుకొచ్చారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :