Sunday, 08 September 2024 07:39:01 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

బిగ్ బాస్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. రతికాకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్

Date : 16 October 2023 10:18 AM Views : 105

జై భీమ్ టీవీ - సినిమా / : బిగ్ బాస్ సీజన్ 7 లో చాలా మంది హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. వారిలో రతికా రోజ్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ హౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి తన గేమ్ తో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. సైడ్ క్యారెక్టర్స్ తో పలు సినిమాల్లో మెప్పించింది రతిక. ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే పటాస్ షో ద్వారా స్టాండప్ కామెడీ చేసి క్రేజ్ తెచ్చుకుంది రతిక. ఆతర్వాత మెల్లగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సినిమాల్లో చిన్న చిన్న పత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఆ క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. ఇక వచ్చి రాగానే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ అయ్యి మనోడిని ముగ్గులోకి దింపేసింది. దాంతో రైతు బిడ్డ కాస్త రతికా భజన చేస్తూ ఆమె చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు చిరాకు తెప్పించాడు. ఆతర్వాత ఆమె ఉన్నట్టుంది ప్రశాంత్ పై రివర్స్ అవ్వడంతో సీన్ రివర్స్ అయ్యింది. ఆతర్వాత యావర్ తో పులిహోర కలిపింది రతిక.. అంతే కాదు హౌస్ లో ఉన్నవాళ్లందరితో గొడవలు పెట్టుకొని రచ్చ చేసింది. ఇక రతిక ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఈ అమ్మడికి అదృష్టం తలుపు తట్టింది. హీరోయిన్ గా బంపర్ ఆఫర్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఏకంగా స్టార్ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకుంది. రతికా హీరోయిన్ గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు రాఘవేంద్రరావు. ఇక ఈ సినిమాలో లీడ్ రోల్ లో రతికా నటించనుంది. రతికా మాట్లాడుతూ.. నా కల నెరవేరింది అనిపిస్తుంది. లెజెండ్రీ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా చేయడం నా అదృష్టం. నా ఫోటోలు, నేను నటించిన సినిమాల్లోని సీన్స్ చూసి ఆయన ఈ పాత్రకు న్యాయం చేయగలనని నమ్మి నన్ను సెలక్ట్ చేశారు. ఇదొక ఎమోషనల్ లవ్ డ్రామా. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వస్తాయి అని తెలిపింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :