Sunday, 08 September 2024 07:40:10 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

బిగ్‏బాస్ ఫేమ్ శ్వేత వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన బ్యూటీ..

Date : 07 November 2023 12:00 PM Views : 97

జై భీమ్ టీవీ - సినిమా / : బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో అంటే అది బిగ్‏బాస్. ఈ షో ద్వారా ఎంతో మంది తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. అలాగే సినీపరిశ్రమలో ఎన్నో ఆఫర్స్ సైతం అందుకున్నారు. ఇప్పటివరకు ఆరు సీజన్స్ జరగ్గా..ఇప్పుడు 7 సీజన్ విజయవంతంగా రన్ అవుతుంది. బిగ్‏బాస్ షో ద్వారా పాపులర్ అయినవారిలో శ్వేతా వర్మ ఒకరు. ఈ షోకు రాకముందు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది శ్వేతా. రాణి, పచ్చీస్, మ్యాడ్, ముగ్గురు మొనగాళ్లు, గుడ్ లఖ్ సఖి, ఏకం, రోజ్ విల్లా వంటి చిత్రాల్లో కనిపించింది. సహయనటిగా అనేక సినిమాల్లో కనిపించినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. కానీ బిగ్‏బాస్ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. అయితే బిగ్‏బాస్ తర్వాత గుర్తింపు మాత్రమే వచ్చింది కానీ.. ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రం రావడం లేదనిపిస్తుంది. చాలా రోజులుగా ఈ బ్యూటీ సైలెంట్ అయ్యింది. తాజాగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. కొన్ని రోజులుగా నెట్టింట సైలెంట్ అయిన శ్వేతా వర్మ.. ఇటీవల తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. “మా ఇంట్లో భయంకరమైన అగ్ని ప్రమాదాన్ని చూశాను. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. రూం మొత్తం కాలిపోయింది. నా ఫ్యామిలీ, నా పెట్స్ సేఫ్ గానే ఉన్నారు. కానీ ఈ భయంకరమైన ఘటన నుంచి కోలుకునేందుకు కాస్త టైం పట్టేలా ఉంది. నా కోసం మీరు ప్రార్ధించండి. మేం అయితే ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలోకి వస్తాను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం శ్వేతా చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. ఆమెకు ధైర్యం చెబుతున్నారు నెటిజన్స్. బిగ్‏బాస్ రియాల్టీ షోలో శ్వేతావర్మ గొడవలు.. ఆనీ మాస్టర్ తో క్లోజ్ గా ఉండడంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :