Sunday, 08 September 2024 07:49:01 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

టాలీవుడ్‌ టాప్‌ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు ఇంట మరో విషాదం.. అప్పుడు భార్య ఇప్పుడు..

Date : 10 October 2023 09:50 AM Views : 85

జై భీమ్ టీవీ - సినిమా / : టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్‌ రాజు తండ్రి శ్యామ్‌ సుందర్‌ రెడ్డి (86) సోమవారం (అక్టోబర్ 9) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర సీమలో విషాదం నెలకొంది. దిల్‌రాజు తండ్రి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. కాగా టాలీవేడ్‌ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినీ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్‌ బాస్టర్‌ మువీస్‌ నిర్మించారు. నిర్మాత దిల్ రాజు పూర్తి పేరు వెంకట రమణారెడ్డి. చిన్నతనం నుంచే కుటుంబం అంతా రాజు అని పిలవడంతో రాజు అనే పేరు స్థిరపడిపోయింది. నితిన్‌ హీరోగా నటించిన ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి మంచి పేరు తెచ్చుకోవడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది. సినిమాల్లోకి రావడానికి ముందు పలు వ్యాపారాలు చేసిన ఆయన సినీ డిస్ట్రిబ్యూటర్‌గా తొలినాళ్లలో పనిచేశారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన దిల్‌రాజు తెలుగు సినీ పరిశ్రమలో మంచిపేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి వయోభారంతో గత కొంతకాలంగా అనారోగ్యతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి, తల్లి ప్రమీలమ్మ. దిల్ రాజుకు విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. దిల్ రాజు మొదటి భార్య అనితతో హన్షిత అనే కుమార్తె వీరికి జన్మించింది. అనిత ఆరోగ్యంతో 2020లో మరణించడంతో.. దిల్‌ రాజు తేజస్విని అనే మరో యువతిని రెండో వివాహం చేసుకున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :