Sunday, 08 September 2024 07:44:57 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

‘భగవంత్ కేసరి’ థియేటర్ల వద్ద అభిమానుల రచ్చ.. బాలయ్య కటౌట్‏కు అభిషేకం.. పాలతో కాదు..

Date : 20 October 2023 09:05 AM Views : 103

జై భీమ్ టీవీ - సినిమా / : తమ అభిమాన హీరో సినిమా విడుదల రోజున అభిమానులు చేసుకునే సంబరాల గురించి చెప్పక్కర్లేదు. థియేటర్లను అలంకరించి, భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి.. వాటికి పూలమాలలు వేసి.. తమ హీరో సినిమా విడుదల రోజును పెద్ద పండగలా జరుపుకుంటారు. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు చాలా చూస్తుంటాం. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి తెలిసిందే. ఈరోజు లియో విడుదల సందర్భంగా తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ చేసిన హడావిడి గురించి చూశాం. రోడ్లుపై వందల సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ భగవంత్ కేసరి సినిమా విడుదల సందర్భంగా అభిమానులు చేసిన సందడికి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. గతంలో ప్రభాస్, పవన్ కళ్యాణ్, చరణ్ సినిమాల విడుదల సందర్భంగా తమ హీరోస్ కటౌట్లకు పాలాభిషేకం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు నందమూరి అభిమానులు మాత్రం తమ అభిమానాన్ని చూపించిన విధానం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఈరోజు విడుదలైంది. అభిమానులు తమ అభిమాన నటుడి సినిమాను ఉత్సాహంగా స్వాగతించారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల బాలకృష్ణ కటౌట్‌కు పాలు, పెరుగుతో అభిషేకం కాకుండా కొందరు అభిమానులు ఆల్కహాల్ తో అభిషేకం చేశారు. అది కూడా మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ తో అభిషేకం చేశారు. అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు కర్ణాటకలోనే జరిగినట్లుగా తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం బెంగుళూరులోని వినాయక్ థియేటర్‌లో విడుదలైంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు తొలి షో వేశారు. ఈ సమయంలో కొందరు బాలకృష్ణ అభిమానులు నందమూరి బాలకృష్ణ కటౌట్‌పై అల్కహాల్ తో అభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అదే సమయంలో కొబ్బరికాయలపై కర్పూరం వెలిగించి హారతి ఇస్తూ్ సినిమాకు స్వాగతం పలికారు. టపాసులు పేల్చి ‘జై బాలయ్య, జై జై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో శ్రీలీల, కాజల్ నటించారు. అలాగే బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :