Sunday, 08 September 2024 07:34:27 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

బిగ్‌ బాస్‌ శివాజీ, ‘తొలి ప్రేమ’ వాసుకీల నైంటీస్‌ వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Date : 14 October 2023 01:20 PM Views : 94

జై భీమ్ టీవీ - సినిమా / : ప్రముఖ నటుడు, బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ పెద్దన్న శివాజీ త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. నైంటీస్‌ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఓ ఆసక్తికర తెలుగు వెబ్‌ సిరీస్‌లో శివాజీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఏ మిడిల్ క్లాస్ బ‌యోపిక్ అనేది ఈ సిరీస్‌ క్యాప్షన్‌. ‘తొలి ప్రేమ’ సినిమాలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చెల్లెలిగా నటించిన నటి వాసుకీ ఇందులో శివాజీ సతీమణిగా నటించనుంది. తాజాగా నైంటీస్‌ వెబ్‌ సిరీస్‌కు సంబంధించి వాసుకీ ఫస్ట్‌ రిలీజ్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇందులో మ్యాథ్స్‌ టీచర్‌ చంద్రశేఖర్‌ అనే పాత్రలో శివాజీ నటిస్తుండగా, అతని భార్య శోభారాణి పాత్రలో నటి వాసుకీ కనిపించనుంది. ‘ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక స్ట్రిక్ట్‌ మ్యాథ్స్‌ టీచర్‌ ఉంటారు. అలాంటి మ్యా్థ్స్‌ టీచరే ఈ మన చంద్ర శేఖర్‌’ అంటూ శివాజీ లుక్‌ను రివీల్‌ చేశారు మేకర్స్‌. ‘ఇక మిసెస్‌ శోభారాణితో అంత ఈజీ కాదు. స్ట్రిక్ట్‌ మ్యాథ్స్‌ టీచర్‌నే షేక్ చేసే శోభారాణి. దీపావళికి కలుద్దాం’ అంటూ నటి వాసుకీ లుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వనపర్తి అనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ వెబ్‌ సిరీస్‌ దీపావళికి రానుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో నవంబర్‌ రెండో వారంలో నైంటీస్‌ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు అందుబాటులో రానుందని తెలుస్తోంది. నైంటీస్‌ వెబ్‌ సిరీస్‌కు ఆదిత్య హ‌స‌న్ ద‌ర్శకత్వం వ‌హిస్తున్నాడు. వాసంతిక మచ్చ, మౌళి, స్నేహల్ కామత్, రోహన్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. అజీమ్‌ మొహమ్మద్‌ కెమెరామెన్‌గా, గాంధీ నడికుడియార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. శ్రీధర్‌ సోంపల్లి ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అలాగే షర్వీన్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేయనున్నారు. కాగా తొలిప్రేమ సినిమాతో క్రేజ్‌ తెచ్చుకున్న వాసుకీ ఇటీవలే అన్ని మంచి శకునములే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత తమిళ్‌లో కూడా ఓ వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇప్పుడు నైంటీస్‌ వెబ్‌ సిరీస్‌తో మరోసారి మనల్ని అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో త్వరలోనే ఈ నైంటీస్‌ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్‌, స్ట్రీమింగ్‌ డేట్‌ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :