Sunday, 08 September 2024 07:39:37 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌.. సైతాన్ నటుడి మూవీ ఎక్కడ చూడొచ్చంటే?

Date : 29 October 2023 09:56 AM Views : 97

జై భీమ్ టీవీ - సినిమా / : జెర్సీ సినిమాలో చక్కని అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది శ్రద్ధా శ్రీనాథ్‌. ఆ తర్వాత జోడి, శ్రీకృష్ణ అండ్‌ హిజ్‌ లీలీ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైందీ అందాల తార. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటిస్తూనే ఓటీటీల్లోనూ అదరగొడుతోంది శ్రద్ధా. త్వరలోనే విక్టరీ వెంకటేష్‌ సైంధవ్‌ సినిమాతో మన ముందుకు రానుంది. కాగా 2017లో శ్రద్ధా శ్రీనాథ్‌ నటించిన కన్నడ సినిమా ఆపరేషన్‌ అలమేలమ్మ. సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌కు జోడీగా సైతాన్‌ వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ రిషి నటించాడు. ఇప్పుడీ ఆపరేషన్ అలమేలమ్మ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. ‘రేషన్‌ లో ఇస్తారు షుగర్‌. ఆపరేషన్‌ అలమేలమ్మ బెస్ట్‌ కామెడీ థ్రిల్లర్‌’ అని తన పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చింది ఆహా ఓటీటీ. కిడ్నాప్ డ్రామాతో మొదలై.. సునీల్‌ తెరకెక్కించిన ఆపరేషన్‌ అలమేలమ్మ సినిమాలో రాజేష్‌ నటరంగ, అరుణ్‌ బాలాజీ, షీలమ్‌, విశ్వవిజేత్‌, ధీరజ్‌ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సునీల్‌ సినిమాస్‌ స్టార్‌ ఫ్యాబ్‌ బానర్‌పై అమ్రేజ్‌ సూర్యవంశీ సునీల్‌ ఈ సిమాను నిర్మించారు. జుధాహ్‌ సంధీ సంగీతం అందించారు. కథ బాగుండడంతో కేజీఎఫ్‌ ఫేమ్‌ హోంబలే ఫిల్మ్స్‌ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేయడం విశేషం. ఇక సినిమా కథ విషయానికొస్తే.. డ‌బ్బుపై మోజుతో ప‌ర‌మేష్ అనే అనాథ యువ‌కుడు ఒక బిజినెస్‌మెన్ కొడుకును అపహరిస్తాడు. అయితే ఇదే అతనిని ఇరకాటంలో పడేస్తుంది. మరి కిడ్నాప్‌ వ్యవహారంతో పరమేష్‌ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? కిడ్నాప్‌ డ్రామాతో అనన్య అనే స్కూల్‌ టీచర్‌కు సంబంధమేంటో తెలుసుకోవాలంటే ఆపరేషన్‌ అలమేలమ్మ సినిమా చూడాల్సిందే.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :