Sunday, 08 September 2024 07:48:50 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

‘బిగ్ బాస్’ హౌజ్‌ నుంచి వరుసగా మహిళలే ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారు? కారణమిదేనా?

Date : 11 October 2023 11:58 AM Views : 99

జై భీమ్ టీవీ - సినిమా / : ఏడో సీజన్‌లో ఎలిమినేట్‌ అయిన వారంతా మహిళలే ఉండడం గమనార్హం. మొదటి వారంలో కిరణ్‌ రాథోడ్‌, రెండో వీక్‌లో షకీలా, మూడో వారంలో సింగర్‌ దామినీ భట్ల, నాలుగో వీక్‌లో రతికా రోజ్‌ హౌజ్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక ఐదో వారం ఎలిమినేషన్‌లో భాగంగా శుభశ్రీ రాయగురు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి వరుసగా మహిళలే ఎలిమినేట్ కావడంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ప్రముఖ టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్‌ సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇప్పటికే ఐదో వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ గేమ్‌ షో ఆరో వారంలోకి ప్రవేశించింది. సెప్టెంబర్‌ 3న ఏడో సీజన్‌ ప్రారంభం కాగా.. తాజాగా మినీ లాంచ్‌ కూడా జరిగింది. ఐదుగురు కంటెస్టెంట్లు బయటకు పోగా మరో ఐదుగురు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో హౌజ్‌లోకి అడుగుపెట్టారు. కాగా ఏడో సీజన్‌లో ఎలిమినేట్‌ అయిన వారంతా మహిళలే ఉండడం గమనార్హం. మొదటి వారంలో కిరణ్‌ రాథోడ్‌, రెండో వీక్‌లో షకీలా, మూడో వారంలో సింగర్‌ దామినీ భట్ల, నాలుగో వీక్‌లో రతికా రోజ్‌ హౌజ్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక ఐదో వారం ఎలిమినేషన్‌లో భాగంగా శుభశ్రీ రాయగురు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి వరుసగా మహిళలే ఎలిమినేట్ కావడంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. బిగ్‌బాస్‌ కావాలనే ఉమెన్‌ కంటెస్టెంట్స్‌ను బయటకు పంపిస్తున్నాడని కొందరు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో అలాంటిదేమి ఉండదని ఓటింగ్‌ ప్రకారమే ఎలిమినేషన్‌ జరుగుతుందంటున్నారు. నామినేషన్‌ లిస్టులో నిలిచిన మహిళలలకు ఓట్లు తక్కువగా వస్తున్నాయని అందుకే హౌజ్‌ నుంచి బయటకు వెళ్లిపోతున్నారని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మొత్తానికి ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఇప్పటివరకు బిగ్‌బాస్‌ ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా, పురుషులే టైటిల్‌ విజేతగా నిలుస్తున్నారు. మహిళా కంటెస్టెంట్లు ఫైనల్‌ దాకా వస్తున్నా బిగ్‌ బాస్‌ ట్రోఫీ మాత్రం గెల్చుకోలేకపోతున్నారు.మరి ఈ సీజన్‌లో కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగుతుందా? లేక వుమెన్‌ కంటెస్టెంట్లు విజేతగా నిలుస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి. కాగా ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్‌ దీప్‌, ఆట సందీప్‌, శోభాశెట్టి, టేస్టీ తేజా,ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్‌, గౌతమ్‌ కృష్ణ, అశ్విని, షావలి, పూజా మూర్తి, పావని హౌజ్‌లో కొనసాగుతున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :