Sunday, 08 September 2024 07:43:04 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

రాంగ్ టైమింగ్ లో వస్తున్న రవితేజ

Date : 11 October 2023 12:00 PM Views : 99

జై భీమ్ టీవీ - సినిమా / : రవితేజ రాంగ్ టైమింగ్‌లో వస్తున్నారా..? కోరికోరి మరీ కష్టాలు కొని తెచ్చుకుంటున్నారా..? ఆయన పాన్ ఇండియన్ సినిమాకు ముహూర్తం కరెక్టుగా లేదా..? టైగర్ నాగేశ్వరరావు అటాక్‌కు అక్టోబర్ 20 ఎంతవరకు సరైంది..? అదే రోజు తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ చాలా సినిమాలు వస్తున్నాయి. మరి వాటి ప్రభావం టైగర్‌పై ఎంత ఉండబోతుంది..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. టైగర్ నాగేశ్వరరావుతో పాన్ ఇండియన్ హిట్ కొట్టాలని కసితో ఉన్నారు రవితేజ. దానికోసమే పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు మాస్ రాజా. ఎప్పుడూ లేనిది ముంబై వెళ్లి అక్కడ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. . టైగర్ నాగేశ్వరరావుతో పాన్ ఇండియన్ హిట్ కొట్టాలని కసితో ఉన్నారు రవితేజ. దానికోసమే పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు మాస్ రాజా. ఎప్పుడూ లేనిది ముంబై వెళ్లి అక్కడ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ట్రైలర్ లాంఛ్ కోసమే భారీ ఈవెంట్ ఏర్పాటు చేసారు. అక్టోబర్ 20న భారీ అంచనాల మధ్య విడుదల కానుంది టైగర్ నాగేశ్వరరావు. పాన్ ఇండియన్ ప్రమోషన్ వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలోనే అసలు కన్ఫ్యూజన్ మొదలైందిప్పుడు. ఎందుకంటే అదే రోజు మిగిలిన భాషల్లోనూ భారీ సినిమాలు విడుదల కానున్నాయి. తెలుగు వరకు అయితే రవితేజ సినిమాకు ఏ ఇబ్బంది లేదు.. ఇక్కడ థియేటర్స్ సమస్య కూడా రాదు.. కానీ తమిళ, హిందీలో అలా కాదు కదా..! అక్టోబర్ 19న తమిళంలో లియో విడుదల కానుంది. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అంతా లియో కావాలని ఎగబడుతున్నారు. విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు. తెలుగులోనూ ఈ సినిమాను భారీగానే విడుదల చేస్తున్నారు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు ఉన్నా.. తెలుగులో మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి. లియో కారణంగా టైగర్ నాగేశ్వరరావుకు తమిళంలో మంచి డిస్ట్రిబ్యూషన్ సంస్థల సపోర్ట్ లభించడం లేదు. మరోవైపు హిందీలోనూ అక్టోబర్ 20న టైగర్ ష్రాఫ్ నటిస్తున్న గణపథ్ విడుదల కానుంది. థియేటర్స్‌లో మేజర్ షేర్ ఈ సినిమాకు వెళ్తాయి. దాంతో రవితేజ సినిమాకు ఊహించిన థియేటర్స్ అయితే రావు. కన్నడ, మలయాళంలోనూ లియో దూకుడు కనిపిస్తుంది. వీటన్నింటినీ అధిగమించి టైగర్ అటాక్ ఎలా ఉండబోతుందో చూడాలిక.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :