Sunday, 08 September 2024 07:43:14 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

బాక్సాఫీస్ వద్ద ‘లియో’ సాలిడ్ కలెక్షన్స్.. దళపతి సినిమా అంటే ఆమాత్రం ఉంటది మరి..

Date : 20 October 2023 09:11 AM Views : 103

జై భీమ్ టీవీ - సినిమా / : కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళనాడులో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో. అభిమానులంతా ఇళయదళపతి అంటూ ముద్దుగా పిలిచుకునే ఈ హీరో సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవలే వారసుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న విజయ్.. తాజాగా లియో సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైంది. తెలుగులో విజయ్ కు ఫాలోయింగ్ ఉండడంతో తెలుగులోనూ సినిమాను రిలీజ్ చేశారు. మొదటిరోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా భారీగానే వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ విజయ్ కెరీర్ లోనే సాలిడ్ ఓపెనింగ్స్ అని తెలుస్తోంది. ఇందులో త్రిష, అర్జున్ సర్జా, సంజయ్ దత్ కీలకపాత్రలలో నటించారు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో విజయ్ డిఫరెంట్ రోల్స్ పోషించారు. అయితే లియో సినిమా కలెక్షన్స్ గురించి ఇంకా అధికారికంగా తెలియరాలేదు. కేవలం సోషల్ మీడియా నివేదికల ఆధారంగా ఈ చిత్రం మొత్తం రూ.140 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. భారతదేశంలో నిన్న ఒక్కరోజే రూ.63 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఓవర్సీస్ నుంచి రూ.66 కోట్లు రాబట్టిందని తెలుస్తోంది. లియో బాక్సాఫీస్ కలెక్షన్స్. తమిళనాడు – 30 కోట్లు కేరళ – 11 కోట్లు కర్ణాటక – 14 కోట్లు ఏపీ-టీజీ – రూ.15 కోట్లు రెస్ ఆఫ్ ఇండియా (ROI) – రూ. 4 కోట్లు దాదాపు 13 ఏళ్ల తర్వాత త్రిష, విజయ్ ఈ సినిమాతో మరోసారి జోడి కట్టాయి. చాలా కాలం తర్వాత ఈ సూపర్ హిట్ కాంబోను వెండితెరపై చూసిన అడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా తమిళనాడులో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :