Sunday, 08 September 2024 07:39:43 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

తగ్గని దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్.. పెద్దాయనకు గుండె పోటు.. ఇందిరా దేవి ఆవేశం!

Date : 07 November 2023 12:03 PM Views : 114

జై భీమ్ టీవీ - సినిమా / : ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే దగ్గర ఉంటారు. సీతా రామయ్య, ఇందిరా దేవి ఏం తీర్పు చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నిర్ణయం ఎవరిని బాధించినా.. నచ్చకపోయినా.. ఆ నిర్ణయాన్ని కాదనే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు. ఇదే తుది నిర్ణయం అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. నువ్వు చెప్పు బావా.. ఇన్నాళ్లూ అన్యాయానికి ఎదురు నిలబడి న్యాయం మాత్రమే చెప్పావ్. కానీ ఇప్పుడు జరిగింది వేరు. ఇదొక మోసం. దీనికి పరిహారం లేదు పరిష్కారం మాత్రమే ఉంది. అదేంటో చెప్పు అని ఇందిరా దేవి అంటుంది. ఇంతవరకూ నాలో అంతర్మథనం మొదలైంది. అయితే ఈ నిర్ణయం అని సీతా రామయ్య చెప్పబోతే.. ఒక్క నిమిషం తాతయ్య అని రాహుల్ అంటాడు. కోర్టులో తీర్పు ఇచ్చే ముందు కోర్టుకు కూడా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడుగుతారు. నాకూ అలాంటి అవకాశం కావాలి అంటున్నా అని రాహుల్ అంటాడు. చెప్పు అని సీతా రామయ్య అంటాడు. తప్పు చేశాను.. చాలా తప్పులు చేశాను. నేను తప్పు చేశాను కరెక్టే.. కానీ స్వప్న ఇంకా పెద్ద మోసం చేసింది: రాహుల్ కానీ ఇంత పెద్ద కుటుంబంలోని నేనే చేసిన పని వల్ల మచ్చ తెచ్చిన వాడిని అవుతానని భయపడి స్వప్న గురించి చెప్పలేక పోయాను. అందువల్ల నేను దోషిలా ఉండాల్సి వచ్చింది. మీరందరూ ఒప్పుకున్న తర్వాతే నేను స్వప్నని పెళ్లి చేసుకున్నా. కానీ ఆర్వాత తనని ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు. మారిపోయాను స్వప్నని ప్రేమగా చూశాను. కానీ స్వప్న మాత్రం నన్ను మోసం చేసింది. ఈ ఇంట్లో వాళ్లందర్నీ మోసం చేసింది. ఆ తర్వాత అయినా చెప్పకుండా.. సీమంతం దాకా మోసం చేసింది. ఇది ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి చేసిన మోసం. కానీ నేను మాత్రం స్వప్నతో కాపురం చేయలేను. అంతా మర్చిపోయి ఆమెతో కలిసి ఉండలేను. కాబట్టి మీరు నాకు విడాకులు ఇప్పించండి తాతయ్యా అని రాహుల్ అడుగుతాడు. ఆ తర్వాత రుద్రాణిని నీ నిర్ణయం కూడా అదేనా అని సీతా రామయ్య అడుగుతాడు. అదే నాన్న.. నాకు ఈ కోడలు వద్దు అని రుద్రాణి కూడా చెబుతుంది. ఆ తర్వాత అపర్ణా దేవి కూడా మాట్లాడుతూ.. మావయ్య గారూ మనం బురదలో పడ్డాం. ఇందులో స్వప్న పాత్ర ఎంత ఉందో.. కావ్య హస్తం కూడా అంతే ఉంది. ఇంతదాకా వచ్చాక స్వప్నతో పాటు కావ్యని కూడా పంపించేద్దాం. రాజ్ కి విడాకులు ఇప్పిద్దామని అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అపర్ణ మాటలకు రుద్రాణి కూడా కరెక్ట్ వెళ్లి పోండి.. దరిద్రం పోతుందని అంటుంది. దరిద్రం అయినా ఈజీగా పోతుంది కానీ.. నేను అంత సులభంగా ఇల్లు పోయేది లేదు. మిమ్మల్ని రాహుల్ని కోర్టుకు లాగుతా. ఇంట్లోకి వచ్చిన కోడినో, కుక్కనో తరిమేసినట్టు కోడల్ని కూడా తరిమేద్దాం అనుకుంటున్నారా. అదంత సులువు కాదు. నేను బయటకు వెళ్లాల్సి వస్తే అందర్నీ బయటకు లాగుతాను గుర్తు పెట్టుకోండని స్వప్న అంటుంది. ఏయ్ కావ్య నువ్వు మధ్యలో రాకు. ఇదేం పురాణాలు కాదు అత్తింట్లో అష్టకష్టాలు పడుతూ సర్దుకు పోవడానికి.. ఈ కాలం వేరు. నేను తల దించుకుని ఉండలేను రుద్రాణి గారూ: స్వప్న: నేను నీలా కాదు.. తల వంచుకుని ఉండలేను.. రుద్రాణి గారూ అని స్వప్న అంటుంది. ఏయ్ ఎక్కువ మాట్లాడితే ఊరుకోను.. ఒళ్లు ఎలా ఉంది. నన్ను పేరు పెట్టి పిలుస్తావా అని రుద్రాణి అంటే.. మీకు ఇంకో పేరు ఉందా అని స్వప్న అడుగుతుంది. ఇదంతా విన్న సుభాష్ ఆపండి అని గట్టిగా అరుస్తాడు. ఈ తప్పులో రాహుల్ కి కూడా భాగం ఉంది. ముందు వాడు మోసం చేయడం వల్లే స్వప్న ఈ అబద్ధం ఆడి పెళ్లి చేసుకుంది. కాబట్టి రాహుల్, రుద్రాణి, భర్తని అత్తని మోసం చేసిన స్వప్న.. ముగ్గురూ కలిసి బయటకు వెళ్లండని సుభాష్ అంటాడు. అన్నయ్యా.. అదేంటి అని రుద్రాణి అడిగితే.. నీ కోడలు కోర్టుకు వెళ్తాను అంటోందని సుభాష్ అంటాడు. దానికి కోడల్ని గెంటేయండి మమ్మల్ని వెళ్లమంటారు ఎందుకు? అని రుద్రాణి అంటే.. అసలు తప్పంతా మీ ముగ్గురిలోనే ఉంది. దరిద్రం వదలాలంటే మీ ముగ్గురే బయటకు వెళ్లాలి అని సుభాష్ అంటాడు. అలాగే వెళ్లి పోతే అంకుల్.. మా ఆస్తి మాకు పంచండి అని స్వప్న అడుగుతుంది. స్వప్న మాటలకు అందరూ షాక్ అవుతారు. ఏంటి మీ ఆస్తినా.. మీకు ఆస్తి కూడా ఉందా? మీ పుట్టింటి నుంచి నువ్వు ఎన్ని కోట్లు తెచ్చావ్? మీ అత్త వాళ్ల అత్తింటి నుంచి ఎన్ని కోట్లు తెచ్చింది? రుద్రాణి కట్టు బట్టలతో పుట్టింటికి వచ్చింది. ఆ మాటకు వస్తే ఆవిడకు మా ఇల్లు పుట్టిల్లే కాదు. మా మావగారు దయదలచి.. ఆశ్రయం ఇచ్చి చదివించి పెళ్లి చేశారు. మీ అత్తకే గతి లేదు. నీకేం పంచుతారు? అని అపర్ణ అంటుంది. ఇంటి సభ్యుల తగాదాలకు.. సీతా రామయ్యకు గుండెపోటు: నాన్నా ఏం వదిన ఏం మాట్లాడుతుంతో విన్నావా.. అంతే ఇన్నాళ్లుగా నేను ఈ ఇంటి ఆడ పడుచుగా ఉన్నది నిజమేనా? వాడే కనుక సవ్యంగా ఉంటే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను? ఇన్ని మాటలు ఎందుకు పడతాను. వదిన నువ్వు బయట నుంచి వచ్చిన దాన్ని. నేను ఇక్కడే పరిగిన దాన్ని. నీకు ఎంత హక్కు ఉందో నాకూ అంతే హక్కు ఉందని రుద్రాణి అంటుంది. వన్నీ వింటున్నా సీతా రామయ్యకు గుండె పోటు వస్తుంది. ఆఖరికి ఇప్పుడు కూడా తప్పించుకోవాలని చూస్తున్నావా నాన్నా అని రుద్రాణి అడుగుతుంది. షటప్ అత్తా.. జస్ట్ షటప్.. మానవత్వం అనేది కాస్త అయినా ఉండాలి. ఆస్తులు, హక్కులు, అర్హతలు వీటి గురించి మాట్లాడే నీ నుంచి ఇంతకన్నా నిజాయితీ ఆశించడం మాదే తప్పు. నీకు ఆశ్రయం ఇచ్చిన తాతయ్యా.. ఆస్తి పంపకాలు వచ్చే సరికి నటిస్తున్నాడు అని అంటావా.. అసలు ఆయన ఎంత కాలం బ్రతుకుతాడో నీకు తెలుసా.. ఇప్పుడు నన్ను మాట్లాడనివ్వండి. ఇక నిజం దాచి లాభం లేదు. తాతయ్య క్యాన్సర్ తో బాధ పడుతున్నారని నిజం చెప్పేస్తాడు. ఇంకెంత కాలం బ్రతికి ఉండరు అని రాజ్ చెప్తాడు. రాజ్ ఏం మాట్లాడుతున్నావ్ అని ఇందిరా దేవి అడుగుతుంది. నిజం నాన్నమ్మ.. తాతయ్య మనకు దూరం కావడానికి ఇంకొద్ది రోజులు మాత్రమే గడువు ఉందని రాజ్ చెప్తాడు. ఈ నిజం తెలిసిన ఇందిరా దేవి కన్నీరు మున్నీరుగా బాధ పడుతుంది. మీరు లేకపోతే నేను ఎలా బతుకుతాను బావా.. లేదు బావా నీకేం కాదు. పోతే నేను పుణ్య స్త్రీగానే పోవాలి అని ఇందిరా దేవి బాధ పడుతుంది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారు: సీతా రామయ్య నేను ఉన్నా.. పోయినా ఈ కుటుంబం ముక్కలు కాకూడదని అనుకున్నా.. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారు. అందరూ కలిసి ఉండాలని స్వప్నని, కావ్యని క్షమించమని చెప్పాలని అనుకున్నా. కానీ ఎవరి నిర్ణయం వాళ్లు తీసుకుంటున్నారు. కాపురాలు కూల్చేస్తామంటున్నారు అని సీతా రామయ్య బాధ పడతాడు. ఇక ఇందిరా దేవి ఆవేశంతో.. ఏ కొమ్మని ఎవరూ తుంచడానికి వీల్లేదు. ఈ ఇల్లు ముక్కలు అయి పోతుందంటే మాత్రం మా పెద్దరికం చూస్తూ ఊరుకోదు. ఎవ్వరినీ ఎవ్వరైనా గడప దాటి వెళ్లమనడానికి వీల్లేదని ఇందిరా దేవి అంటుంది. నా మనవరాళ్లు ఇద్దరూ ఇక్కడే ఉంటారు. ఈ ఇంట్లోనే ఉంటారు. కాదని లేదని మీరు అనుకుంటే తల్లిగా.. అత్తగా.. నేను ఎవ్వర్నీ క్షమించను అర్థమైందా అని చెప్తుంది. కావ్య, స్వప్న ఇద్దర్నీ పిలిచి నచ్చ జెప్తాడు సీతా రామయ్య. మీరు క్షేమంగా ఉండాలి అదే మాకు కావాల్సింది అని స్వప్న అంటుంది. రాజ్ ని కూడా పిలుస్తాడు. నువ్వు బలవంతంగా కాపురం చేస్తున్నావ్ అని నాకు అర్థమైంది. నువ్వు కావ్యని మనస్ఫూర్తిగా.. భార్యగా స్వీకరించాలి సీతా రామయ్య అంటాడు. కానీ రాజ్ మాత్రం ఎలాంటి జవాబు చెప్పడు. ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :