Sunday, 08 September 2024 07:30:06 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఓటింగ్‌లో ఉల్టా పుల్టా.. దూసుకెళుతోన్న భోలే.. డేంజర్‌ జోన్‌లో ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్‌

Date : 27 October 2023 11:08 AM Views : 98

జై భీమ్ టీవీ - సినిమా / : బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ఎనిమిదో వారం నామినేషన్లు హోరాహోరీగా సాగాయి. కంటెస్టెంట్లు ఒకరిని ఒకరు నామినేట్‌ చేస్తూ తిట్టుకున్నారు. ముఖ్యంగా శివాజీ- శోభా వెట్టి, పల్లవి ప్రశాంత్‌- గౌతమ్‌ కృష్ణ, శోభా శెట్టి- భోలే షా వలి- ప్రియాంకల మధ్య మాటల తూటాలు పేలాయి. బిగ్‌ బిస్‌7 ఎనిమిదో వారంలో మొత్తం ఎనిమిది మంది నామినేషన్స్‌లోకి వచ్చారు. శివాజీ, అశ్విని శ్రీ, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్, ఆట సందీప్, భోలే షావలి, గౌతమ్ కృష్ణ నామినేషన్ల లిస్టులో ఉన్నారు. ఇక వీరికి సోమవారం నుంచి ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఎప్పటి లాగే బిగ్‌ బాస్‌ పెద్దన్న శివాజీ అత్యధిక ఓటింగ్స్‌తో అగ్ర స్థానంలో ఉన్నాడు. అయితే అనూహ్యంగా సింగర్‌ భోలే షా వళి ఓటింగ్స్‌లో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం అతను రెండో స్థానంలో ఉండటం గమనార్హం. మూడో స్థానంలో సీరియల్ బ్యాచ్‌ లీడర్‌ అమర్ దీప్ చౌదరి కొనసాగుతున్నాడు. అలాగే నాలుగో స్థానంలో అశ్విని శ్రీ, ఐదో ప్లేస్‌ లో గౌతమ్‌ కృష్ణ, ఆరో స్థానంలో ప్రియాంక జైన్‌ ఉన్నారు. ఇక ఏడో స్థానంలో సందీప్‌ మాస్టర్‌ ఉండగా, అట్టడుగు స్థానంలో కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి ఉంది. ఒక వేళ ఇదే ఫ్లో కొనసాగితే మాత్రం మోనిత బిగ్‌ బాస్‌ నుంచి బయటకు వెళ్లాల్సిందే. కాగా బిగ్‌ బాస్‌ హౌజ్‌కు కావాల్సిన కంటెంట్‌ అందిస్తోంది శోభా శెట్టి. అయితే ఇదే సమయంలో తన బిహేవియర్‌, మాటలతో ఆడియెన్స్‌కు చికాకు తెప్పిస్తోందన్న విమర్శలు మూట గట్టుకుంది. అందుకే ఆమెపై భారీగా ట్రోలింగ్‌ జరుగుతోంది. ఇప్పుడిదే ఓటింగ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపి నట్లు తెలుస్తోంది. దీనికి తోడు శివాజీ ఈ వారం సీరియల్‌ బ్యాచ్‌కు గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు. సీరియల్‌ బ్యాచ్‌ నుంచి ఒక పెద్ద చేప బయటకు వెళ్లిపోతంది అని ముందుగానే హింట్‌ ఇచ్చేశాడు బిగ్‌ బాస్‌ పెద్దన్న. అలా ఈ వారం నామినేషన్స్‌, ఓటింగ్ లిస్టు చూస్తే ప్రియాంక జైన్‌, సందీప్‌ మాస్టర్‌, శోభా శెట్టి డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. అయితే శోభాతో పోల్చుకుంటే ప్రియాంక, సందీప్‌ లపై జనాలకు కాస్త పాజిటివ్‌ ఫీల్‌ ఉంది. కాబట్టి ఈ వారం మోనిత పెట్టె సర్దేసుకోక తప్పదని తెలుస్తోంది. అయితే ఈ కార్తీక దీపం విలన్‌కు బిగ్‌ బాస్‌ అండ మెండుగా ఉంది. మరి ఎలిమినేషన్‌లో ఏమైనా మార్పులు వస్తాయా? శోభను గట్టెక్కించేందుకు మరొకరిని బలి పశువుని చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :