Sunday, 08 September 2024 07:38:16 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

రష్మికకు మద్ధతుగా సినీతారలు.. ఫేక్ వీడియోపై నాగచైతన్య సీరియస్..

Date : 07 November 2023 12:02 PM Views : 95

జై భీమ్ టీవీ - సినిమా / : గత రెండు రోజులుగా హీరోయిన్ రష్మికకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. రష్మిక ముఖంతో కనిపిస్తోన్న ఓ అభ్యంతకరమైన వీడియో క్లిప్ నెట్టింట అప్లోడ్ అయిన ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ అయ్యింది. అందులో ఉన్నది బ్రిటీష్ ఇండియన్ సోషల్ మీడియా పర్సనాలిటీ జారా పటేల్. కానీ ఆమె ముఖాన్ని మార్ఫింగ్ చేసి AI టెక్నాలజీతో రష్మిక ఫేస్ యాడ్ చేసి నెట్టింట షేర్ చేశారు. ఇక ఈ ఫేక్ వీడియోను ఒరిజినల్ వీడియోను కలిపి షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు జర్నలిస్ట్ అభిషేక్. ఇక అదే వీడియోపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ రియాక్ట్ అవుతూ.. ఫేస్ మార్ఫింగ్ చేసిన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రియాక్ట్ అవుతూ.. రష్మిక ఫేస్ మార్ఫింగ్ చేసిన వారిని గుర్తించి శిక్షించాలని అన్నారు. ఇప్పటికే రష్మిక ఫేక్ వీడియోపై కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. మార్ఫింగ్ వీడియోస్ చేసిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. రష్మికకు మద్దతుగా టాలీవుడ్ సెలబ్రెటీస్ స్పందిస్తున్నారు. సింగర్ చిన్మయి, సాయి ధరమ్ తేజ్, ప్రియా ప్రకాష్ వారియర్ స్పందించారు. ఇక తాజాగా అక్కినేని నాగచైతన్య సైతం రష్మిక ఫేక్ వీడియోపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. “టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే బాధగా ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. భాదితుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటిపై కొత్త చట్టాలు అమలు చేయాలి. మీకు మరింత ధైర్యం, బలం చేకూరాలి” అంటూ ట్వీట్ చేశారు. చైతన్య్ ట్వీట్‏కు రష్మిక స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :